ములుగులో తెరాస నేతలు వర్సెస్ కలెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈయన ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. ఈయనేమో అదే జిల్లా జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్. అధికార టీఆర్ఎస్ నాయకుడు. జిల్లా అభివృద్ధిలో కలిసి సాగాల్సిన ఈ ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. ముఖ్యంగా కలెక్టర్ తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో రెండు వర్గాల నుంచి పోటాపోటీగా లేఖలు బయటకు వచ్చి దుమారం రేపుతున్నాయి.
ఆ మధ్య జిల్లాలో ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన విలువ అధికారపార్టీ నేతలమైన తమకు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రహస్య సమావేశం నిర్వహించారు. ఆ అంశంపై చర్చ జరుగుతుండగానే.. కలెక్టర్‌పై జడ్పీ ఛైర్మన్ జగదీష్ ఆరోపణలు అందరిలోనూ అటెన్షన్ తీసుకొచ్చాయి. ములుగు ఇంఛార్జ్‌గానే కాకుండా.. జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న తనను ఏ కార్యక్రమానికీ కలెక్టర్ పిలవడం లేదన్నది జగదీష్ ఆరోపణ. ఇటీవల దళితబంధుపై నిర్వహించిన సన్నాహక సమావేశానికి ములుగు, భద్రాచలం ఎమ్మెల్యేలను ఆహ్వానించి.. తనను విస్మరించారని చెబుతూ సీఎంకు ఫిర్యాదు చేశారు జడ్పీ ఛైర్మన్. సమావేశానికి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినవాళ్లే. పైగా జడ్పీటీసీలు.. ఇతర ప్రజాప్రతినిధులకు కూడా మీటింగ్‌పై సమాచారం లేదన్నది ఆయన వాదన. ఈ అంశం రచ్చగా మారుతుండటంతో కలెక్టర్ కార్యాలయం స్పందించింది. ప్రజాప్రతినిధులు అంటే అత్యంత గౌరవం ఉందని.. వారిని కించపరిచే ఉద్దేశం లేదని ప్రకటన విడుదల చేశారు. మీటింగ్ సమాచారం ఇచ్చామని ఆ వివరణలో ఉంది.
Also Read
- Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్‌లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
కలెక్టరేట్ స్పందన చూశాక టీఆర్ఎస్ నేతలు మరో లేఖను రిలీజ్ చేశారు. తమకు ఎవరికీ ఆహ్వానాలు అందలేదని.. ప్రజల్ని తప్పుదోవ పట్టించుకున్నారని ఆరోపించారు. మేడారం జాతర సమయంలో దాదాపు 7 కోట్ల పనుల విషయంలోనూ కలెక్టర్‌పై పలు ఆరోపణలు చేశారు నేతలు. వాటిపై విచారణ చేయాలని కోరుతూ సీఎంకు లేఖ రాశారు. ఈ లేఖల యుద్ధం చూశాక.. కలెక్టర్‌కు.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ఎక్కడ గ్యాప్ వచ్చింది అని కొందరు ఆరా తీశారట. ఎప్పటి నుంచో జిల్లాలో తమకు ప్రొటోకాల్ పాటించడం లేదని జడ్పీ ఛైర్మన్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ఇప్పుడు శ్రుతిమించినట్టు సమాచారం. చినికి చినికి గాలి వానగా మారి సమస్య సీఎంవో వరకు చేరినట్టు స్థానికంగా జరుగుతున్న చర్చ. ఇదే సమయంలో ములుగు పరిణామాలపై నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయట. మరి.. ఈ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు పడుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
-
Rajnath Singh: హైదరాబాద్‌కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?