Off The Record: పదవిలో ఉన్నాను కాబట్టి పద్ధతిగా ఉండాల్సి వస్తోంది.. లేదంటే నా పవర్ ఏంటో చూపించేవాడినంటూ… రజనీకాంత్ రేంజ్‌లో డైలాగ్స్ చెబుతున్నారట ఆ ఎమ్మెల్యే. అది కూడా ఒకసారో.. రెండు సార్లో కాదు. చేతికి మైక్ దొరికినప్పుడల్లా పంచ్ డైలాగ్స్ పేలుస్తూనే ఉన్నారు. అధికార కూటమిలో ఉన్న ఆ ఎమ్మెల్యేకి ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఆయన్ని ఇరిటేట్ చేస్తోంది ఎవరు?
Read Also: CM Revath Reddy : వచ్చే 72 గంటలు అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు
విలక్షణ రాజకీయాలకు కేరాఫ్‌గా ఉండే తాడేపల్లిగూడెంలో ఇప్పుడు ప్రతిపక్ష నేతల కంటే అధికారంలో ఉన్నవాళ్ళే ఎక్కువ అసహనానికి గురవుతున్నారట. గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తున్నా.. అవినీతికి దూరంగా ఉంటున్నా.. నాకే ఎందుకిలా అంటూ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో, ఇటీవల ఎక్కడ మీటింగ్ జరిగినా.. ఆయన ఒకటే డైలాగ్ చెబుతున్నారట. పదవిలో ఉన్నాను కాబట్టి సర్దుకుపోతున్నాను.. అదే పాత మనిషిగా ఉండి ఉంటే ఈపాటికి ఒక్కొక్కళ్ళ అంతు తేల్చే వాడినంటూ స్పీకర్లు అదిరేలా స్పీచ్ ఇస్తున్నారు. ఇదంతా చూస్తున్న వాళ్ళు సార్ బొలిశెచ్చి బాషా అంటూ చమత్కరించుకుంటున్నారు అది వేరే సంగతి. కానీ.. ఆయన బాధేంటో గమనిస్తే మాత్రం… అదంతా కూటమిలో కోల్డ్‌వార్ ప్రభావమేనని అంటున్నారు పరిశీలకులు. పెద్దలు సర్ధుకుపొమ్మని పదేపదే చెబుతున్నా.. తాడేపల్లిగూడెం జనసేన టిడిపి మధ్య మాత్రం కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయట. 2024 ఎన్నికల్లో గూడెం నియోజకవర్గంలో జెండా ఎగరేసింది జనసేన. బొలిశెట్టి శ్రీనివాస్ ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. లోకల్ టీడీపీ నేతలు మాత్రం అస్సలు లెక్క చేయడం లేదట. ఎవరైతే మాకేంటి అన్నట్టుగా ఉన్నారన్నది లోకల్ టాక్.
Read Also: Gang Rape: స్విమ్మింగ్ పూల్ ఇద్దరు మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం..
ఇక, ఈసారికి గ్లాస్.. అయితే కావచ్చుగానీ.. మళ్ళీ వచ్చేది మాత్రం సైకిలేనంటూ నియోజకవర్గం మొత్తం టముకేసి చెబుతున్నారు టీడీపీ నాయకులు. ఆ మాట బొలిశెట్టి చెవినపడ్డా… అలా ప్రచారం చేస్తోంది ఎవరో తెలిసినా కూడా… వాళ్ళ మీద నోరు మెదపలేని పరిస్థితి ఆయనది. ఏదన్నా గట్టిగా అంటే.. వెంటనే జనసేన అధిష్టానం పిలిచి సర్దుకుపొమ్మని చెప్పడంతో నోరు తెరవలేకపోతున్నారట బొలిశెట్టి. దీంతో ఎందుకొచ్చిన గొడవనుకుని ఆయన ఎంతగా సర్దుకుపోతున్నా… టిడిపి నేతలు మాత్రం రెచ్చిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు తలనొప్పులు పెరుగుతున్నాయంటున్నారు. ఎమ్మెల్యేగా తానే ఉన్నా.. పెత్తనం చేయాలనుకునే నేతలు టిడిపిలో పెరిగిపోవడంతో.. వాళ్ళ మీద ఉన్న అసహనాన్ని ప్రతి మీటింగ్‌లోనూ బయటపెడుతున్నారట. తన మాటతీరు, వ్యవహారశైలితో.. బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో ఎంతోకొంత గుర్తింపు తెచ్చుకుంటున్నా… సొంత నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నేతల తీరుతో విసిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు పోటీగా టిడిపి ఇంఛార్జ్ వలవల బాబ్జి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, పాలనాపరమైన అంశాల్లో వేలుపెట్టడమే కాదు.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తనకే సీటు ఇస్తారని, కాబోయే ఎమ్మెల్యేని నేనేనని ప్రచారం చేసుకోవడంతో బొలిశెట్టికి మండిపోతున్నట్టు తెలిసింది. పైగా ఇటీవల బాబ్జీకి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్‌గా నామినేటెడ్ పోస్టు ఇవ్వడంతో గూడెంలో జనసేనకు తలపోటు ఎక్కవయ్యిందంటున్నారు గ్లాస్ పార్టీ నేతలు.
ఇక, ఇప్పటి నుంచే తన మాట వింటే భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే రేపు తాను గెలిచిన తర్వాత జరిగేది జరక్కమానదంటూ వలవల స్వీట్ వార్నింగ్స్ ఇవ్వడంతో అధికారులకు సైతం ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఈ వార్‌కు చెక్‌పెట్టేందుకు గతంలోనే సమన్వయకమిటీ కొన్ని సూచనలు చేసింది. కానీ క్షేత్రస్థాయికొచ్చేసరికి సీన్ మాత్రం రివర్స్‌లో ఉంటోందని సమాచారం. ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ తన పని తాను చేసుకుని పోతున్నా… టిడిపి ఇన్ఛార్జ్ నుంచి సహకారం అందకపోవడంతో సతమతమవుతున్నట్టు చెబుతున్నారు. కలిసి పనిచేయమంటే… తన పదవిని, పవర్‌ను లాక్కోవడం కాదని బొలిశెట్టి సన్నిహితుల దగ్గర అంటున్నట్టు తెలిసింది. తన ఒక్కడి పరిస్థితే ఇలా లేదని, దాదాపుగా జనసేన ఎమ్మెల్యేలందరిదీ సేమ్ సీన్ అని మైకు దొరికినప్పుడల్లా ఆరున్నొక్క రాగం అందుకుంటున్నారట తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు.
