Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
- రాజగోపాల్ రెడ్డి వైఖరిపై కాంగ్రెస్‌లో విస్తృత చర్చలు
- కేబినెట్ మంత్రుల్ని టార్గెట్ చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే
- మంత్రి పదవి దక్కదని డిసైడై గట్టిగా నోరు తెరుస్తున్నారా?
- భట్టి, ఉత్తమ్ లక్ష్యంగా తాజా విమర్శలు
- నిధులన్నీ ఉత్తమ్ తీసుకెళ్తున్నారంటూ కామెంట్స్
- బిల్లుల కోసం ఆత్మగౌరవం చంపుకుని భట్టి దగ్గరికన్న ఎమ్మెల్యే
- అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే మాట్లాడకూడదా అంటూ రివర్స్
- ఎండ్ కార్డ్ పడని డైలీ సీరియల్లా రాజగోపాల్ ఎపిసోడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చకు దారితీస్తోంది. రోజుకొక సీనియర్ లీడర్ని టార్గెట్ చేస్తూ మీడియాలో విస్తృతమైన ప్రచారంలో ఉంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే. మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారాయన. ఆ తర్వాత గురి మార్చి…. ఇప్పుడు క్యాబినెట్లో కీలకంగా ఉన్న మంత్రులందరినీ ఎయిమ్ చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఏదో ఒక రకంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఇన్నాళ్లు ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యే…ఇప్పుడిక వరుసగా ప్రభుత్వంలో ఉన్న నాయకులను టార్గెట్ చేయడం వెనక వ్యూహం ఏంటనే చర్చ మొదలైంది కాంగ్రెస్ వర్గాల్లో. తాను తాపత్రయపడుతున్న క్యాబినెట్ బెర్త్ దక్కదని డిసైడ్ అయ్యారా..? లేదంటే తనకంటూ ఒక ప్రత్యేక వ్యూహాన్ని ఎంచుకున్నారా..? అన్న కోణంలో ఎంక్వైరీలు మొదలయ్యాయట.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. మొదట్లో ఆయన సీఎంతో విభేదించినా ఈ ఇద్దరు నాయకులతో అంతో ఇంతో సన్నిహితంగానే మెలుగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మీదే విమర్శలు మొదలుపెట్టారు. బిల్లులు ఇవ్వడం లేదనీ భట్టిని, నిధులన్నీ ఆయనే తీసుకుని పోతున్నారంటూ ఉత్తమ్‌ను టార్గెట్ చేయడంతోనే అసలు ట్విస్ట్ మొదలైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరికి వెళ్లాలంటే ఆత్మగౌరవాన్ని చంపుకుని వెళ్తున్నామంటూ ఘాటుగానే విమర్శలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.
Also Read
ఇటీవల కొన్నాళ్ళ నుంచి ప్రభుత్వంపై గాని… మంత్రులపై మీదగాని ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్‌గా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నకిరేకల్‌లో సీఎం సభకు హాజరైనప్పటి నుంచి కొంత సైలెంట్ అయ్యారాయన. ఆ తర్వాత కాంట్రాక్టు వ్యవహారంలో హైకోర్టు మెట్లు కూడా ఎక్కేశారు. అప్పటినుంచి మళ్లీ తన వాయిస్ రెయిజ్ చేస్తున్నారు మునుగోడు శాసనసభ్యుడు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన సమస్యలపై మాట్లాడకూడదా అంటూ రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు కూడా. దీంతో… ఈయన వ్యవహారం ఎండ్ కార్డ్ పడని డైలీ సీరియల్లాగా మారిపోయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయినాసరే… కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఈ విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఇద్దరు కీలక మంత్రులు లక్ష్యంగా అస్త్రాలు ఎక్కుపెట్టడం, అదీకూడా… ఘాటైన పదజాలం వాడటంతో…. ఇక మీదట ఎమ్మెల్యే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు..? పార్టీ నాయకత్వం ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటన్న విషయంలో రకరకాల విశ్లేషణలు పెరిగిపోతున్నాయి.
తాజావార్తలు
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
-
It’s a Medical Miracle : కోమా నుంచి లేవగానే అకస్మాత్తుగా సూపర్ పవర్స్.. ఓటీటీలో క్రైమ్ కామెడీ సెన్సేషన్
-
Story Board : మొన్న అర్నబ్.. ఇప్పుడు మురసు.. ఏపీని వణికించిన వరుస తుపాన్లు..
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..