ధర్మవరంలో గరం గరం పాలిటిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రశాంతంగా ఉన్న ఆ నియోజకవర్గంలో రాజకీయ వేడి మొదలైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరో యువ నాయకుడు కూడా వీరికి జత కలవడంతో హీట్ మరింత పెరిగింది. ఎన్నికలే లేని ఈ సమయంలో అక్కడ ఎందుకంత లొల్లి..?
ధర్మవరంలో పొలిటికల్ హీట్..!
రాజకీయాల్లో అనంతపురం జిల్లా తీరు కాస్త ఢిఫరెంట్. ఏదో ఒక నియోజకవర్గంలో రగడ కామన్. ఒక్కోసారి తాడిపత్రి.. మరోసారి బాలయ్య ఇలాకా హిందూపురం.. ఇంకోసారి రాప్తాడు. తాజాగా ధర్మవరంలో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మధ్య వార్ మరో అంకానికి చేరుకుంది. ఇద్దరూ రెండేళ్లపాటు సైలెంట్‌గా ఉన్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి లక్ష్యంగా బాణాలు సంధిస్తున్నారు టీడీపీని వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. ధర్మవరంలో కేతిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. వరసగా ఆ వివరాలు వెల్లడిస్తానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే.
Also Read
కేతిరెడ్డిపై ఆరోపణల మోతాదు పెంచిన మాజీ ఎమ్మెల్యే
అనుకున్నట్టుగానే మొదటి ఏపిసోడ్ విడుదల చేశారు సూర్యనారాయణ. ఎమ్మెల్యే అనుచరులు భూకబ్జాలు చేస్తున్నారని.. ప్రభుత్వ కార్యాలయాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఇవే అంటూ కొన్ని బయటపెట్టారు మాజీ ఎమ్మెల్యే. ఈ ఆరోపణలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శలు.. ప్రతి విమర్శల వల్ల పనికాదని అనుకున్నారో ఏమో.. మూడోసారి ఆరోపణల తీవ్రత పెంచారు మాజీ ఎమ్మెల్యే.
చెరువు వెనకవైపు కొండమీద ఒక ఇంద్ర భవనాన్ని ఎమ్మెల్యే నిర్మించారని.. అదంతా కబ్జా చేసిందేనని మండిపడ్డారు సూర్యనారాయణ. కోట్లు విలువచేసే కార్లు, గుర్రాలు, బోటింగ్‌లను కేతిరెడ్డి ఏర్పాటు చేసుకున్నారని.. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఒక పురాతన ఆలయంలో గుప్తనిధుల తవ్వకాలు చేస్తున్నారని.. తన ఇంద్రభవనంలో అసాంఘీక కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పి సంచలనం రేపారు సూర్యనారాయణ. అయితే మాజీ ఎమ్మెల్యే ఉనికి కోసమే రచ్చ చేస్తున్నారని వాదిస్తున్నారు కేతిరెడ్డి.
పరిటాల శ్రీరామ్ ఎంట్రీతో మరింత వేడి..!
ఈ ఫైట్‌లో ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ కూడా చేరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డిని.. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఇద్దర్నీ శ్రీరామ్ టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విరుచుకుపడుతూనే.. ఇంకోవైపు సూర్యనారాయణపై గురిపెట్టారు. ఇలా ముగ్గురు నేతల వరస కామెంట్స్‌తో ధర్మవరం రాజకీయం వేడెక్కుతోంది. మరి.. ధర్మవరం దంచుడు రాజకీయాల్లో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!