TRS : ఆ నియోజక వర్గంలో టీఆర్ఎస్ లో కర్చీఫ్ పాలిటిక్స్ మొదలయ్యాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. ఇంకోవైపు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇక్కడ వేగంగా పావులు కదుపుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడుసార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014, 2019లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు సునీతా లక్ష్మారెడ్డి. పార్టీ కూడా ఆమెను మహిళా కమిషన్ ఛైర్పర్సన్ను చేసింది. అప్పటి నుంచి నర్సాపూర్‌లో దూకుడు పెంచారు సునీత.
పుట్టిన రోజుల వేడుకల సమయంలో నర్సాపూర్ అంతా సునీత కటౌట్లు భారీగా ఏర్పాటు చేశారు. సర్పంచ్‌లు.. ఎంపీటీసీలు వేడుకలకు ఆహ్వానించి టచ్‌లో ఉండాలని చెప్పారట. అలాగే కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తనతో కలిసి సాగిన కేడర్‌ను ఆకర్షించే పనిలో ఉన్నారట సునీత. వచ్చే ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసే ఉద్దేశంతోనే ఆమె గేర్ మార్చినట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. సునీత వర్గీయులు సైతం టికెట్ మేడమ్‌కే వస్తుందని ప్రచారం మొదలుపెట్టేశారు.
Also Read
ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఇటీవల మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి ఇంటిలోనే ఉంటున్నారు. ఇది సునీతా లక్ష్మారెడ్డికి కలిసొచ్చినట్టుగా కేడర్ చెబుతోంది. అయితే ఎమ్మెల్యే వర్గీయులకు ఈ పరిణామాలు అస్సలు రుచించడం లేదట. ఒకప్పుడు నర్సాపూర్‌లో పరిమితంగానే కార్యక్రమాల్లో పాల్గొనేవారు సునీతా లక్ష్మారెడ్డి. ఇప్పుడు ప్రొగ్రామ్ చిన్నదే అయినా అటెండ్ అవుతున్నారట. ఫంక్షన్లు పరామర్శలు వేటినీ వదలడం లేదట ఈ మాజీ మంత్రి. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అనుచరులు మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ తమ నేతకే వస్తుందని.. సునీతకు నిరాశ తప్పదని కౌంటర్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులను ఏకరవు పెడుతున్నారట.
మొత్తానికి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. నర్సాపూర్ టీఆర్ఎస్లో మాత్రం ఎలక్షన్ వేడి రాజుకుంది. టికెట్ కోసం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అయితే ఈ వర్గపోరులో ఎవరి పైచెయ్యి సాధిస్తారో.. ఇంకెవరూ ఉసూరు మంటారో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!