Off The Record: ఈటల రాజేందర్ తాను ఇరుక్కుని తెలంగాణ బీజేపీని కూడా ఇరికించారా? ఆయన విషయంలో పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? కాళేశ్వరం కమిషన్ తప్పు పట్టింది కాబట్టి… ఆ తలనొప్పులు మనకెందుకని అనుకుంటుందా? లేక ఎంపీని వెనకేసుకుని వస్తుందా? ఈటల రాజేందర్ వ్యవహారం తమకు తలనొప్పిగా మారినట్టు బీజేపీలోని ఓ వర్గం ఫీలవుతోందా? లెట్స్ వాచ్.
Read Also: Krishna Arrest: లైంగిక వేధింపుల కేసులో మరో డాన్స్ మాస్టర్.. విచారణలో సంచలన విషయాలు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది బీజేపీ. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే…. సీబీఐ దర్యాప్తు జరిపిస్తామని గతంలో ప్రకటించారు ఆ పార్టీ నాయకులు. ఇప్పటికీ… దానికి కట్టుబడి ఉన్నామంటూనే…, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా… కేంద్రాన్ని సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేస్తున్నారు కమలం నాయకులు. అలాగే… ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉండి, ప్రస్తుతం తమ ఎంపీ అయిన ఈటల రాజేందర్‌ను కూడా… కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళి అప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్పాలని ఆదేశించింది పార్టీ. ఈటల కూడా కమిషన్ విచారణకు హాజరై.. తను చెప్పాల్సింది చెప్పారు. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించింది బీజేపీ. కమిషన్ ముందు ఈటల రాజేందర్ చెప్పినదంతా… నాటి ఆర్థిక మంత్రిగా చెప్పారు తప్ప…ఆ వాంగ్మూలంతో పార్టీకి సంబంధం లేదని, అది బీజేపీ వెర్షన్ కాదని కూడా ప్రకటించారు ముఖ్యులు. అదంతా జరిగిపోయిన కథ. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించింది.
Read Also: Tinnu Anand: కేజీఎఫ్ ‘టిను ఆనంద్’ కీలక పాత్రలో కొత్త సినిమా!
అందులో.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కూడా తప్పు బట్టింది. ఆ రోజున ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన తన బాధ్యతలను విస్మరించారని కూడా ఆక్షేపించింది కమిషన్. కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డు లో ఆర్థిక శాఖ ఉన్నా…ఆ శాఖ మంత్రిగా ఆయన పట్టించుకోలేదని తేల్చేసింది. దీంతో, ఇప్పుడు ఈటల ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కమిషన్ రిపోర్ట్‌లో డైరెక్ట్‌గా ఆయన పేరు ఉండడం రాజేందర్ రాజకీయ భవిష్యత్ పై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆయనకు ఇక బీజేపీలో కీలక పదవులు కష్టమేనన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. రిపోర్ట్‌లో ఈటల పేరు ఉండటం అటు పార్టీగా బీజేపీకి కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కమిషన్ విచారణ సందర్భంగా పార్టీ నేతలు తలో మాట మాట్లాడాడటం ఇబ్బందిగా మారిందట. చివరికి రాష్ట్ర అధ్యక్షుడు జోక్యం చేసుకుని నేను చెప్పిందే పార్టీ లైన్ అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా కమిషన్ రిపోర్ట్ లోనే ఎంపీ పేరు ఉంది.
Read Also: Off The Record: మంత్రి వచ్చినా, సీఎం వచ్చినా ఆ జిల్లాలో కొట్టుకోవడం కామన్..!
దీంతో, ఇప్పుడు బీజేపీ ఏ లైన్ తీసుకుంటుంది,ఈటలను ఓన్ చేసుకుంటుందా… లేక బాధ్యుల మీద చర్యలకు డిమాండ్ చేస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇది బీజేపీకి ప్రస్తుతం సంకట స్థితేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది పార్టీకి కక్కలేని, మింగలేని పరిస్థితి అంటున్నారు. అటు తెలంగాణ బీజేపీ నాయకులు కొందరు మాత్రం అవినీతిని సహించేది లేదని, నిజంగానే దోషి అని తేలితే ఎలాంటి వారి మీదైనా…చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు. పూర్తి స్థాయి రిపోర్ట్ బయటకు వచ్చాక, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి బీజేపీ పెద్దల స్పందన ఉంటుందని తెలుస్తోంది. మొత్తం మీద ఈటల తాను ఇరుక్కుని పార్టీని కూడా ఇరుకున పెట్టారన్న చర్చ నడుస్తోంది తెలంగాణ కాషాయవర్గాల్లో.
