Off The Record: తెలంగాణలో ఇప్పుడున్నది పాత కాంగ్రెస్సేననుకుని ఓ ఆట ఆడేద్దామనుకున్నారా లీడర్. అనుకోవడం ఏంటి.. ఆడేశారు కూడా. అలా ఆడీ ఆడీ అలసట వచ్చిందిగానీ.. గోల్ మాత్రం కొట్టలేకపోయారు. ఇక ఇలాగైతే లాభం లేదు, మొదటికే మోసం వస్తుందని గ్రహించి అంతా ఆయన ఇష్టం. ఎలా చెబితే అలా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎవరా లీడర్? ఇక నా భారమంతా ఆయనదేనని ఎవర్ని ఉద్దేశించి అన్నారు?
Read Also: Pakistan Woman: “సార్, నాకు న్యాయం చేయండి”.. ప్రధాని మోడీకి పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తి
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు దానం నాగేందర్. ఇక లోక్‌సభ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే.. కాంగ్రెస్ బీ ఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ర్టీ ఫిరాయింపు, అనర్హత పిటిషన్ వ్యవహారం కొంత స్పీడప్ అవడంతో తనదైన శైలిలో పావులు కదపాలని చూశారు దానం. దాదాపుగా అందరు తెలంగాణ ముఖ్య నాయకుల గడప తొక్కారు. ఇక్కడ వర్కౌట్ అవక.. ఆఖరికి హస్తినలో చక్రం తిప్పాలనుకున్నారు. ఆయన ఎంత టాప్ గేర్‌లో వేసినా.. అక్కడ చక్రం తిరక్కపోయే సరికి.. చేసేదేం లేక ఉసూరుమంటూ తిరిగి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేశారు. అలాగని నాగేందర్‌ను తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా చక్రాలు తిప్పిన నాయకుడేగానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవి ఎక్కడికక్కడ జామ్ అయిపోతున్నాయంతేనన్నది పొలిటికల్ పండిట్స్ మాట.
Read Also: Nayanathara: నయన్ మార్పు విలువ కోట్ల పైమాటే
పాత కాంగ్రెస్‌లో లాగా.. ఏదో.. ఏదేదో.. చేసేద్దామనుకున్నా, ఇప్పుడు వర్కౌట్ అవలేదన్నది పార్టీ వర్గాల మాట. ఇప్పుడసలు అపాయింట్‌మెంట్స్ కూడా దొరకలేదట. ఆ విధంగా.. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి, తత్వం బోధపడ్డాక ఇప్పుడు సైలెంట్‌గా పార్టీ ఏం చెప్తే అది. వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట దానం. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ లీకులు ఇచ్చారాయన. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దల దగ్గర ప్రతిపాదన పెడుతున్నట్టు ప్రచారం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయడానికి రెడీ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. పార్టీలో చేరిన కొత్తల్లో.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించిన హైడ్రా విషయంలో నెగెటివ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు నాగేందర్. అలాగే…మరికొన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడారాయన. కానీ… అప్పట్లో ఆచితూచి వ్యవహరించారు ప్రభుత్వ పెద్దలు. ఇప్పుడిక అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకుంది.
Read Also: Off The Record: జగిత్యాల కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్
ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయిన ఎమ్మెల్యే దానం…ఆ అంశం స్పీకర్ దగ్గర పెండింగ్‌లో ఉందంటూ… తన వాదనను సుప్రీంకోర్టులో వినిపిస్తున్నట్టు ప్రకటించారు. దానికి కొనసాగింపుగా రాజీనామా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని క్లారిటీ ఇచ్చేశారు. ఇన్నాళ్లు ఇదిగో రాజీనామా, అదిగో రాజీనామా అంటూ చెప్పుకొచ్చిన దానం నాగేందర్ ఇప్పుడు సీఎం నిర్ణయమే ఫైనల్ అంటూ క్లారిటీ ఇవ్వడం చూస్తుంటే…. మొత్తానికి తత్వం బోధపడ్డట్టుందని కాంగ్రెస్ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. వేయాల్సిన ట్రయల్స్ అన్నీ వేసేసి… ఇక చేసేదేం లేదని డిసైడయ్యాకే ఆయన తెల్ల జెండా ఊపేశారా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఇన్నాళ్ళు తాను ఏం చెప్పినా నడుస్తుందని భావించి… పాత రోజుల్లోలాగే… వ్యవహరించిన ఎమ్మెల్యే… ఇప్పుడు పరిస్థితుల్ని పూర్తిగా అవగతం చేసుకుని దారికి వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అనర్హత విషయంలో సీఎం రేవంత్ రెడ్డి
ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని, ఎన్నికలను ఎదుర్కోవడం నాకు కొత్త కాదని చెప్పడం లాంటివన్నీ ఇందులో భాగమేనని చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.
