Site icon NTV Telugu

Off The Record: చింతలపూడి వైసీపీలో ఆధిపత్య పోరు

Chintalpudi

Chintalpudi

Off The Record: ఆ నియోజకవర్గం వైసిపిలో ఎప్పుడూ ఒకటే లొల్లా? పవర్‌లో ఉన్నామా? ప్రతిపక్షంలో ఉన్నామా అన్న దాంతో సంబంధంలేకుండా.. ఉన్నంతలో ఆధిపత్య ప్రదర్శనకు నేతలు పోటీ పడుతున్నారా? మాజీ ఎంపీ మనుషులుగా చెలామణి అయ్యే నేతలు కొందరు మొత్తం కెలికేస్తున్నారా? ఏ సెగ్మెంట్‌లో ఉన్నాయి అలాంటి దారుణ పరిస్థితులు? పెత్తనాల పోరు గురించి పార్టీ కేడర్‌ ఏమంటోంది?

Read Also: Crime News: అసూయ, పగ, ప్రతీకారం.. ఉన్మాదులుగా మారుతున్న మనుషులు! ఈ చిన్నమ్మే ఉదాహరణ

వైసీపీలో వర్గ పోరుకు కేరాఫ్ చింతలపూడి నియోజకవర్గం అన్న పేరుంది. ఇక్కడ పనిచేసే వారికంటే.. ఇతరులే పైచేయి కోసం ప్రయత్నిస్తారని, అదే అసలు సమస్య అని చెప్పుకుంటారు. 2019ఎన్నికల్లో చింతలపూడిలో వైసీపీ తిరుగులేని ఆధిపత్యం సాధించినా.. చివరి వరకు ఎంపీ వర్గం వర్సెస్ ఎమ్మెల్యే అనుచరగణం అన్నట్టుగా కోల్డ్‌వార్ నడిచింది. అప్పటి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గంగా చెప్పుకునేవాళ్ళంతా.. నాటి చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు చేసారని, ఎమ్మెల్యే చేయాల్సిన పనుల్ని కూడా ఎంపీ వర్గం చేసుకుంటూ పోవడంతో ఆధిపత్య పోరు పీక్స్‌కు వెళ్ళిందని చెప్పుకుంటారు. ఆ ఎఫెక్ట్‌తోనే.. నియోజకవర్గంలో పార్టీ పూర్తిగా దెబ్బతిందని సొంత నేతలే ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

Read Also: Off The Record: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఓ కులానికి చెందిన TDP నాయకులు కుదురుగా ఉండలేకపోతున్నారా..?

ఇక్కడ అసలుకంటే కొసరు వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందన్న ఆగ్రహంతో మాజీ ఎమ్మెల్యే ఎలిజా పార్టీనుంచి పక్కకి తప్పుకున్నారట. ఇక ఇప్పుడు అదే సమస్య చింతలపూడి వైసిపి ఇంఛార్జిగా ఉన్న కంభం విజయరాజును కూడా వెంటాడుతోందని సమాచారం. దీంతో అలర్టయిన విజయరాజు… మొహమాటాలు లేకుండా పనిచేసేవారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని గట్టిగా ఫిక్సయ్యారట. ఇందులో భాగంగానే మండల అధ్యక్షులు, ఇతర పదవుల్లో మాజీ ఎంపీ వర్గాన్ని పక్కనెట్టి పని చేసుకుంటూ పోతున్నట్టు తెప్పుకుంటున్నారు. జనంలో తిరగాల్సింది కన్వీనర్.. ఆయనకి అనుకూలంగా పనిచేయాల్సిన బాధ్యత క్యాడర్‌పై ఉంటుందని, మధ్యలో ఎవరెవరి పెత్తనాలో ఎందుకని ఆయన అంటున్నట్టు సమాచారం. అందుకే కోటగిరి శ్రీధర్ వర్గంగా, నియోజకవర్గంలో తామే కీలకమని చెప్పుకునే కొందరిని దాదాపుగా పక్కన పెట్టారట విజయరాజు. పార్టీ కార్యక్రమాలను బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తుంటే… అందుకు కోటగిరి వర్గం సహకరించకుండా దూరం జరిగిందని సమాచారం.

Read Also: Pocso Act: మైనర్ బాలికపై కన్నేస్తే.. ఏళ్ల తరబడి చిప్ప కూడే! పోకిరీలు జర జాగ్రత్త

ఇటీవల చింతలపూడిలో “బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ” కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలోనూ మాజీ ఎంపీ అనుచరులు అటువైపు కన్నెత్తి చూడలేదట. ఇంతకాలం పార్టీని తమ భుజాలపై నడిపిస్తున్నామని చెప్పుకొచ్చిన నేతల్ని పక్కన పెట్టడం ఇపుడు చింతలపూడిలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో నియోజకవర్గంలో మళ్ళీ గ్రూపు తగాదాల అంశం తెరపైకొచ్చింది. మాజీ ఎంపీ వర్గమని, అసెంబ్లీ నియోజకవర్గంలో తామే కీలకమని చెప్పుకొచ్చిన నేతలంతా కలసి మళ్ళీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారని సమాచారం. దీంతో మరోసారి చింతలపూడి వైసిపి రాజకీయం రచ్చకెక్కబోతోందని అంచనా వేస్తున్నారు పరీశీలకులు. అధికారంలో ఉన్నపుడు ఒకటే పేచీ.. అధికారంలో లేనపుడు కూడా అదే వైఖరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోందట పార్టీ కేడర్‌.

Read Also: Khammam: భర్త డ్యూటీకి వెళ్లగానే మామతో శారీరక సంబంధం.. చూసిన 11 ఏళ్ల బాలికను..

కేవలం ఆధిపత్య ప్రదర్శన కోసం అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రాధాన్యత తగ్గించాలని చేసిన ప్రయత్నాలు తీవ్ర వివాదాలకు కారణం అయ్యాయన్నది ఓపెన్ సీక్రెట్. నియోజకవర్గ రాజకీయాల్లో తమదే పైచేయిగా ఉండాలన్నట్టు కొంతమంది వ్యవహరించడంతో చింతలపూడిలో ఎమ్మెల్యేలైనా, ఇంఛార్జ్‌లైనా డమ్మీలుగా మారిపోతూ వచ్చారని వైసీపీ వర్గాలే చెప్పుకొస్తున్నాయి. అదే పరిస్థితి కొనసాగితే మొదటికే మోసం వస్తుందని భావించిన ఇన్ఛార్జ్‌ ఇప్పుడు పార్టీ పెద్దలకు నచ్చజెప్పుకుని మరీ… తనకు అనుకూలంగా పనిచేసేవారికి పదవులు ఇప్పించుకుంటున్నారట. దీంతో కోటగిరి వర్గంగా చెప్పుకునే కొంత మంది పార్టీకి దూరం జరిగి తమకు ప్రాధాన్యత ఉన్న పదవులు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. గ్రూపు తగాదాలతో ఎపుడూ సతమతమయ్యే చింతలపూడి వైసిపిలో ఎన్నికలు ముగిసిన ఏడాది నుంచే వర్గపోరు ఎక్కువ కావడంతో… ముందు ముందు ఇంకెంత దారుణంగా పరిస్థితులు మారతాయోనన్నది కేడర్‌ టెన్షన్‌.

Exit mobile version