Off The Record : విజయనగరం టీడీపీలో మారుతున్న పరిస్థితులు
- విజయనగరం టీడీపీలో మారుతున్న పరిస్థితులు
- చిన్న శ్రీను చేరికతో లెక్కలు మారతాయన్న ఆందోళన
- వైసీపీ నేతగా ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా విస్తృత పరిచయాలు
- ఆ నెట్వర్క్ని ఇప్పుడు ఎలా విస్తరిస్తారోనని కొందరి టెన్షన్
- చీపురుపల్లిలో కిమిడి నాగార్జునతో ఇప్పటికే విభేదాలు
- ఇద్దరూ పాత విభేదాలను పక్కనపెడతారా? కొనసాగిస్తారా?
- స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కూడా ప్రభావం
- వివిధ నియోజకవర్గాల్లో పాత విభేదాలను మర్చిపోతారా?
- టీడీపీ లీడర్స్ గతంలో చేసిన ఆరోపణల ప్రస్తావన
- నియోజకవర్గాల్లో చిన్న శ్రీను అనుచరులు ఏం చేస్తారోనన్న కంగారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : విజయనగరం జిల్లా టీడీపీలో చిన్న శ్రీను చిచ్చు రేగుతోందంటున్నారు. పార్టీలోకి ఆయన ఎంట్రీ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. జడ్పీ చైర్మన్‌గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను…. వైసీపీని వీడి కుమార్తె సిరి సహస్ర, అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. బయటి నుంచి చూస్తే ఇది ఒక రాజకీయ చేరికగానే కనిపిస్తున్నా… అంతర్గతంగా టీడీపీ లోపల మాత్రం… ఇది కొత్త సమీకరణాలకు నాంది అవుతుందా అన్న డౌట్స్ పెరుగుతున్నాయట. చిన్న శ్రీను రాకను కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు మాత్రం తమ లెక్కలు మారిపోతాయేమోనన్న ఆందోళనలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో చిన్న శ్రీను జిల్లా వ్యాప్తంగా పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అదే రాజకీయ పరిచయాలు.. అదే అనుచర వర్గం.. అదే లోకల్ నెట్వర్క్ టీడీపీలోకి వస్తే.. ఇప్పటికే ఉన్న వాళ్ళ సంగతేంటన్న ఆందోళనలు పెరుగుతున్నాయట. పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకుడికి భవిష్యత్‌లో ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? ఆయన ఎక్కడ వరకు విస్తరిస్తారు? ఎవరెవరితో కలిసి పనిచేయాల్సి వస్తుందంటూ ప్రస్తుతం విజయనగరం టీడీపీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా చీపురుపల్లిలో గతంలో చిన్న శ్రీనుతో ఢీకొన్న నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి నాగార్జునతో గతంలో రాజకీయ విభేదాలు, సవాళ్లు ఉన్నాయన్న సంగతిని గుర్తు చేస్తున్నారు కొందరు. నిన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారు.. ఇవాళ ఒకే పార్టీలో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. రాజకీయ అవసరాలు పాత విభేదాలను పక్కన పెడతాయా.. లేక కొత్త రూపంలో బయటపడతాయా అన్నదే ఆసక్తికరంగా మారింది. ఇక నెల్లిమర్లలో పరిస్థితి మరింత సున్నితంగా ఉందంటున్నారు. ఇప్పటికే అక్కడ టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్యపోరు చర్చనీయాంశంగా ఉంది. అలాంటి సమయంలో చిన్న శ్రీను అనుచర వర్గం కూడా టీడీపీలోకి వస్తే.. స్థానికంగా లెక్కలు మారే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ పదవులు.. స్థానిక సంస్థల ఎన్నికలు.. అభ్యర్థుల ఎంపిక.. నియోజకవర్గాల వారీగా రాజకీయ ప్రాధాన్యత….. ఇలా ప్రతి అంశంలోనూ కొత్త సమీకరణాలు తెరపైకి రావచ్చన్న చర్చ జరుగుతోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో చిన్న శ్రీనుకు ఉన్న రాజకీయ పరిచయాలు ఎక్కడెక్కడ ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చగా మారింది. ముఖ్యంగా ఆయన వెంట కండువా మార్చే నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారు, వారు ఏయే నియోజకవర్గాల్లో రాజకీయంగా యాక్టివ్ అవుతారన్నదే కీలకంగా మారింది. చిన్న శ్రీను భవిష్యత్‌లో టీడీపీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది.
Also Read
ఇక ఆయన పార్టీ మార్పుపై ప్రత్యర్థుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో తమతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు అధికార పార్టీలోకి రావడంతో.. పాత రాజకీయ ఆరోపణలు, అప్పటి విభేదాలు కూడా మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇది టీడీపీకి రాజకీయంగా మరో సవాల్. ఈ లెక్కన ఒకవైపు కొత్త నాయకుడిని పార్టీలో సమన్వయం చేయాలి. మరోవైపు ఇప్పటికే ఉన్న వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను కాపాడాలి.. ఇంకోవైపు ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కోవాలి. ఈ మూడు అంశాల మధ్య జడ్పీ ఛైర్మన్ ఎంట్రీ… టీడీపీ జిల్లా నాయకత్వానికి కొత్త సవాలేనన్న అభిప్రాయం జిల్లా రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది. శ్రీనుకంటే ఎక్కువగా…. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారన్నదే పాత టీడీపీ నేతల ఆందోళనగా చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు జరుగుతాయన్నదే ఇప్పుడు అసలు పాయింట్.
తాజావార్తలు
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు