MLA Reddy Shanti : పాతపట్నం వైసీపీలో రంగులు మారుతున్నాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ రాజకీయ చరిత్ర.. బలమైన కుల సమీకరణలు కలసిరావడంతో ఎమ్మెల్యే అక్కడ పాగా వేశారు. ప్రస్తుతం ఆ బలమే బలహీనంగా మారుతోందట. స్థానికతను సాకుగా చూపిస్తూ వ్యతిరేకత పెరుగుతోందట. నాడు పల్లకీ మోసిన వాళ్లే నేడు రాంరాం అంటున్నారా? ఎందుకలా? లెట్స్ వాచ్..!
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా హిర మండలంలో సమావేశం అయ్యారు. కొత్తూరు వైస్ ఎంపీపీ తులసి వరప్రసాద్ నేతృత్వంలో 5 మండలాల అసమ్మతి నేతలంతా ఆ సమావేశానికి వచ్చారట. నాన్ లోకల్ అయిన రెడ్డి శాంతికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేశారట అసమ్మతి నేతలు. మొదటి నుంచి వైసీపీ కోసం కష్టపడే నేతలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని.. అసహనం వ్యక్తం చేశారట. స్థానికులకు టికెట్ కేటాయించాలనే డిమాండ్‌ను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో తీర్మానించినట్టు తెలుస్తోంది.
Also Read
పాతపట్నంలో స్థానికేతరులను ఎమ్మెల్యేలుగా చేయడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిర మండలంలో జరిగిన ఆ సమావేశం ప్రస్తుతం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. మొన్నటి వరకు ఎమ్మెల్యేపై విపక్ష పార్టీలు విరుచుకుపడితే.. ఇప్పుడు స్వపక్షంలోని వైరి వర్గమే ఆ పాత్ర పోషిస్తోంది. పైగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గ్రామ గ్రామానికీ తీసుకెళ్లే పనిలో పడ్డారట.
వంశధార జలాలను ఇతర ప్రాంతాలకు తరలించుకు పోతున్నారని.. నియోజకవర్గ ప్రజలకు నీళ్లు కరువయ్యాయని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పార్టీలో ఒంటెద్దు పోకడలు.. ఎమ్మెల్యే PAల అత్యుత్సాహం మొదటికే మోసం తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెడ్డి శాంతి కుమారుడు హిర మండలంలో జడ్పీటీసీగా ఓడిపోయారు. అయినప్పటికీ ఎమ్మెల్యే వైఖరిలో మార్పు లేదని మండిపడుతున్నారట.
మాజీ మంత్రి పాలవలస రాజశేఖరం కుమార్తె ఎమ్మెల్యే రెడ్డి శాంతి. పాతపట్నంతోపాటు మరో రెండు నియోజకవర్గాల్లో పాలవలస కుటుంబం పట్టు ఎక్కువ. ఇక్కడ పాలవలస కుటుంబం చెప్పిన వాళ్లకే టికెట్ ఇస్తుంటారు. ఆ కోటాలోనే రెడ్డి శాంతికి టికెట్ దక్కింది. జిల్లాల విభజన తర్వాత పరిస్థితి మారిపోయిందనే చర్చ నడుస్తోంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండబోవని.. సమయం వస్తే తిరుగుబావుటాలు తప్పదని కామెంట్స్ చేస్తున్నారట. ఈ లుకలుకల తీవ్రత పెరిగి.. పాతపట్నంలో పార్టీతోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాలు వెలవెలబోతున్నాయి. ఎమ్మెల్యే పాల్గొనే.. చేపట్టే ప్రోగ్రామ్స్‌కు ఆమంటే గిట్టని వాళ్లు రావడం లేదు. మరి.. సమస్యను సర్దుబాటు చేసేందుకు వైసీపీ పెద్దలు చొరవ తీసుకుంటారో.. లేక పాలవలస కుటుంబమే నష్ట నివారణ చర్యలు చేపడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!