Adilabad Trs: కేడర్ తీరుతో కలవరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రులు.. ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తుంటే.. అధికారపార్టీ కేడర్ మాత్రం వారికి షాక్ ఇస్తోంది. నియోజకవర్గాలకు బాస్‌లమని చెప్పుకొంటున్న శాసనసభ్యులకు తాజా పరిస్థితులు మింగుడు పడటం లేదట. ఇటీవల జరిగిన పరిణామాలు MLAలను మరింత కలవర పెడుతున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారపార్టీలో ఒక్కటే గుసగుసలు.
భారీ ఏర్పాట్లు చేసినా కేడర్ డుమ్మా..!
ధాన్యం కొనుగోళ్లుపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది అధికార టీఆర్ఎస్. ఇంఛార్జ్ మంత్రి పిలుపుతో ఎమ్మెల్యేలు వెంటనే కార్యాచరణలోకి దిగిపోయారు. కార్యక్రమంలో పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లను భాగస్వామ్యం చేద్దామని అనుకున్నారు శాసనసభ్యులు. పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడికక్కడ మెసేజ్‌లు పెట్టేశారు. తండోప తండాలుగా వచ్చేస్తారని భావించి.. ఫంక్షన్ హాళ్లలో భారీ ఏర్పాట్లు చేశారు. కానీ.. పావు వంతు కుర్చీలు కూడా నిండ లేదు. ఫోన్లు చేసి కేడర్‌ను పిలవాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యేలు వేడుకోవడం కనిపించింది.
Also Read
నిర్మల్‌లో మంత్రి సభలోనే కుర్చీలు ఖాళీ
నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ కేడర్ రాలేదు. అక్కడ టీఆర్ఎస్లో ఉన్న గ్రూప్‌వార్ కారణంగా కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయని చెబుతున్నారు. సభలో ఖాళీ చైర్స్‌ను చూసిన మంత్రి పార్టీ నేతలపై కస్సుమన్నారట. ఇంతలోనే మంత్రి సభలో ఖాళీ కుర్చీలంటూ వీడియోలు బయటకు రావడంతో.. స్థానికంగా సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఎమ్మెల్యేలు కలవరం
రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకున్న సమయంలో నియోజకవర్గంలో పరిస్థితిని చూసి కంగుతింటున్నారట ఎమ్మెల్యేలు. ఇన్నాళ్లూ ఒక పిలుపిస్తే వచ్చే పార్టీ కేడర్.. ఇప్పుడు రాకపోవడంతో కలవరపడుతున్నారట. కేడర్‌తో ఎక్కడ గ్యాప్ వచ్చింది? లోపాలు ఎక్కడ ఉన్నాయో ఆరా తీసే పనిలో పడ్డారట ఎమ్మెల్యేలు. సమస్యను వెంటనే సర్దుబాటు చేసుకోకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అవుతుందని.. సన్నాహక సమావేశాల పరిస్థితి చూశాక ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
గ్రూప్‌వార్‌ను పట్టించుకోని ఎమ్మెల్యేలు
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో లోకల్ ప్రజాప్రతినిధులకు పడటం లేదు. వర్గాలుగా విడిపోయారు. బోథ్‌లో రచ్చకెక్కిన గ్రూప్‌వార్‌ను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం తెలిసినా.. ఎమ్మెల్యేలు ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. ఇప్పుడు సమావేశంలో ఖాళీ కుర్చీలు కనిపించే సరికి నూటొకటి కొట్టిందట. ఆదిలాబాద్‌లో రోజాంతా ఎదురు చూసినా టీఆర్ఎస్ కేడర్ రాకపోవడం చర్చగా మారింది. మరి.. ఈ సమస్యను అధిగమించేందుకు ఎమ్మెల్యేలు.. అధికారపార్టీ నేతలు కేడర్‌కు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!