ఏపీ టీడీపీలో అచ్చెన్న వర్సెస్ కళా వెంకట్రావు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ టీడీపీ అధ్యక్షుడు.. మాజీ అధ్యక్షుడి మధ్య వార్ నడుస్తోందా? పార్టీ నుంచి బహిష్కరించిన నేతకు ప్రాధాన్యం ఇవ్వడంతో నిప్పు రాజుకుందా? శ్రీకాకుళం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిన సంఘటనలు ఏంటి? లెట్స్ వాచ్..!
కళా వెంకట్రావు వ్యతిరేక వర్గానికి అచ్చెన్న దన్ను..?
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
అచ్చెన్నాయుడు.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు. కళా వెంకట్రావు.. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు. ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. పైకి నవ్వుతూ కనిపించినా.. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందన్నది పార్టీలో అందిరికీ తెలిసిందే. కళా వెంకట్రావును ఇబ్బంది పెట్టేందుకు అచ్చెన్న సర్వశక్తులు ఒడ్డుతున్నారని జిల్లాలో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. కొంతకాలంగా ఎచ్చెర్లలో కళాకు వ్యతిరేకంగా ఉన్న కొందరు చోటామోటా లీడర్లను అచ్చెన్న ఎంకరేజ్ చేస్తున్నారట. అచ్చెన్న ఎంకరేజ్ చేస్తున్నవారిలో టీడీపీ నుంచి బహిష్కరణ వేటుపడ్డవాళ్లు కూడా ఉన్నారట.
తమలాంటి వారి పరిస్థితి ఏంటని కేడర్ ప్రశ్న..!
ఇటీవల జిల్లాలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమంలో పార్టీ నుంచి బహిష్కరించిన ఓ నాయకుడు అచ్చెన్నతో రాసుకుని పూసుకుని తిరిగారట. అది చూసి పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి టీడీపీ బ్యానర్‌పైనే కార్యక్రమాలు చేపడుతున్నారట. దీంతో అతడికి టీడీపీ సంబంధం లేదని అప్పట్లో ప్రకటన జారీ చేశారు. అయినా అతను ఆగడం లేదట. ఇప్పుడు అచ్చెన్నతో అంటకాగడంతో చర్చగా మారింది. కళా వెంకట్రావు విషయంలోనే ఇలా చేస్తే.. ఇక తమలాంటి వారి పరిస్థితి ఏంటని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారట.
చంద్రబాబు దీక్షకు వచ్చిన బహిష్కృత నేత
ఇటీవల చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు ఆ బహిష్కృత నేత హాజరయ్యాడు. చంద్రబాబుకు 50 వేలు విరాళంగా ఇచ్చారట. అయితే ఆ నేతను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మాస్క్ ధరించి వేదిక మీదకు వచ్చేలా ప్లాన్ చేశారట. దీనికి కూడా అచ్చెన్న అండదండలు ఉన్నట్టు జిల్లాలో టాక్. పార్టీ నుంచి బహిష్కరించిన వ్యక్తిని ఏకంగా టీడీపీ ఆఫీస్‌లోకి తీసుకురావడం.. చంద్రబాబు దీక్షా వేదిక దగ్గరకు పంపడం మామూలు విషయం కాదని అనుకుంటున్నారు. ఈ ఎపిసోడ్‌లో మరో కొసమెరుపు కూడా ఉంది. అమరావతి నుంచి శ్రీకాకుళానికి తిరిగి వెళ్లాక ఆ బహిష్కృత నేత మరింత రెచ్చిపోతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్ కళాకు కాకుండా తనకే వస్తుందని ఓపెన్‌గానే ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం. దాంతో అచ్చెన్న, కళా వెంకట్రావుల మధ్య ఈ వర్గపోరు ఎక్కడికి దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు.
తాజావార్తలు
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్‌లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్‌ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
-
Modi-Marco Rubio: వైట్‌హౌస్‌ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!