HIT 3 : విశ్వక్ మిస్సయింది అందుకే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని హీరోగా నటించిన హిట్: ది థర్డ్ కేస్ సినిమా అనేక అంచనాల మధ్య మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అని అందరూ అంటున్నప్పటికీ, కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోతోంది. ఈ సినిమాకు ఏకంగా మొదటి రోజు 43 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగుతో సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఒక యంగ్ హీరో మంచి పాత్రను మిస్ చేసుకున్నాడు.
Read More: Black, White & Gray – Love Kills Review: బ్లాక్ వైట్ & గ్రే వెబ్ సిరీస్ రివ్యూ
Also Read
అతను ఎవరో కాదు, విశ్వక్ సేన్. హిట్: ది ఫస్ట్ కేస్ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్, ఈ హిట్: ది థర్డ్ కేస్లో కూడా ఒక కీలక పాత్రలో కనిపించాల్సి ఉంది. అంటే, అతను నటించిన మొదటి సినిమా పాత్రలోనే ఈ సినిమాలో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. నిజానికి, హిట్: ది థర్డ్ కేస్లో సెకండ్ కేస్లో నటించిన అడవి శేష్ కూడా కనిపించాడు. అడవి శేష్ ఎంట్రీ సమయంలో థియేటర్లలో అరుపులు, కేకలు వినిపించాయి. అలాంటి ఒక పాత్రలోనే విశ్వక్ సేన్ కూడా కనిపించాల్సి ఉంది.
Read More: Dasari Awards: దాసరి ఫిలిం అవార్డ్స్ ఉత్తమ కథా చిత్రంగా వరలక్ష్మి ‘శబరి’
ఈ మేరకు షెడ్యూల్ అంతా ఫిక్స్ అయిన తర్వాత, విశ్వక్ సేన్ షూట్‌కు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడిందట. దీంతో కథలో స్వల్ప మార్పులు చేసి షూట్ చేశారు. అడవి శేష్ ఎంట్రీకి కొద్దిసేపటి ముందు విశ్వక్ ఎంట్రీ కూడా ఉండాల్సి ఉంది. కానీ, విశ్వక్ సేన్ అందుబాటులో లేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఆ సన్నివేశాన్ని తొలగించాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే నటించి ఉంటే విశ్వక్ సేన్ కెరీర్‌కు బాగా ప్లస్ అయి ఉండేది. ఎందుకంటే, లైలా లాంటి డిజాస్టర్‌తో ఇబ్బంది పడుతున్న విశ్వక్‌కు ఇలాంటి ఒక మాస్ గెస్ట్ అప్పీరెన్స్ దొరికి ఉంటే, తర్వాతి సినిమాలకు బాగా ఉపయోగపడి ఉండేది.
- Tags
- hit 3
- Vishwak Sen
తాజావార్తలు
-
TVS Callisto 110: టీవీఎస్ కాలిస్టో 110 స్కూటర్ విడుదల.. 33 లీటర్ల స్టోరేజ్, కొత్త ఇంజిన్, ISG టెక్నాలజీ
-
India Lowest T20I Scores: 76 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. చరిత్రలో భారత్ సాధించిన అత్యల్ప స్కోర్లు ఇవే.!
-
Faiza Ali: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను.. నటి ఫైజా అలీ ఓపెన్ కామెంట్స్
-
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు షాకింగ్ న్యూస్.. 5 రోజుల్లోనే! అసలు ఏం జరిగింది?
-
Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!