Black, White & Gray – Love Kills Review: బ్లాక్ వైట్ & గ్రే వెబ్ సిరీస్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3.5 / 5
- MAIN CAST: Mayur More, Palak Jaiswal, Deven Bhojani, Edward Sonnenblick, Hakkim Shahjahan, Anant Jog, Kamlesh Sawant, and others
- DIRECTOR: Pushkar Sunil Mahabal
- MUSIC:
- PRODUCER: Swaroop Sampat and Hemal A. Thakkar
సోనీ లివ్ సంస్థ ఇప్పుడు రీజనల్ కంటెంట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే కొన్ని ఆసక్తికరమైన సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పుష్కర్ సునీల్ మహాబల్ దర్శకత్వం వహించిన బ్లాక్ వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ అనే సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
బ్లాక్ వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ కథ:
నాగపూర్‌లో పేరుమోసిన రాజకీయ నాయకుడి కుమార్తె ఇంటి నుంచి అదృశ్యమవుతుంది. ఆమెను ఆ రాజకీయ నాయకుడి డ్రైవర్ కొడుకు కారులో తీసుకెళ్లినట్లు ఒక హోటల్ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది. అదే హోటల్ ఫుటేజ్‌లో ఆమెను చంపి, ఆమె మృతదేహాన్ని కారులో తీసుకెళ్తున్నట్లు కనుగొంటారు. ఈ క్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక క్యాబ్ డ్రైవర్ సహాతో మరో కుర్రాడిని చంపినట్లు పోలీసులు కేసు ఫైల్ చేసి, అతని కోసం వెతుకుతూ ఉంటారు. అయితే, ఒక ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఈ కేసు మీద ఆసక్తితో ఆ కుర్రాడిని ట్రేస్ చేసి, అతని వెర్షన్‌ను వెలుగులోకి తీసుకొస్తాడు. అతను ఎవరినీ హత్య చేయలేదని, పలు షాకింగ్ విషయాలను బయటపెడతాడు. అయితే, నిజానికి అతను హత్య చేశాడా లేదా? ఆ అమ్మాయి బతికి ఉందా, చనిపోయిందా? అతను చంపకపోతే, పోలీస్ ఆఫీసర్, క్యాబ్ డ్రైవర్ సహాయంతో మరో కుర్రాడిని చంపింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ మొత్తం చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
తెలుగుతో సహా హిందీ, ఇతర భారతీయ భాషల్లో మీరు ఎన్నో క్రైమ్ బేస్డ్ సిరీస్‌లు చూసి ఉంటారు. అయితే, ఇది కాస్త భిన్నమని చెప్పాలి. ఎందుకంటే, హాలీవుడ్‌లో బాగా ప్రసిద్ధమైన ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్‌ను అనుసరిస్తూ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించాడు దర్శకుడు పుష్కర్. నిజానికి, మనం బీబీసీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని డాక్యుమెంటరీ తరహా వెబ్ సిరీస్‌లను చూసి ఉంటాం. ఈ సిరీస్ మొదలైనప్పుడు కూడా దాదాపు అదే ఫీలింగ్ కలుగుతుంది. కానీ, ఇది డాక్యుమెంటరీ కాదు. అలా భ్రమింపజేస్తూ దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. దర్శకుడు చెప్పే కథను చూపిస్తూనే, దానికి పోలీసుల వెర్షన్, అక్యూజ్డ్ వెర్షన్, అలాగే మీడియా ముందు ఉన్న వెర్షన్ ఇలా రకరకాల వెర్షన్‌లను ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. మధ్యలో మాట్లాడుతున్న వారు నిజ జీవితంలో ఆ కేసుకు సంబంధించిన వారేమో అనే అనుమానం కలిగేలా దర్శకుడు కట్ చేసిన విధానం, తీసుకున్న జాగ్రత్తలు, సిరీస్ మీద మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. మధ్యలో సీసీటీవీ ఫుటేజ్ కూడా కనిపించేలా చూపించి, ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశాడు. సాధారణంగా క్రైమ్ సిరీస్‌లు అంటే ప్రేక్షకులకు ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. కానీ, ఈ తరహా ప్రయోగంతో ఆ ఆసక్తిని మరింత పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎక్కడా బోర్ కొట్టకుండా, తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను నిరంతరం కలిగిస్తూ, బింజ్ వాచ్ చేయించేలా రూపొందించాడని చెప్పాలి.
నటీనటుల విషయానికొస్తే, గతంలో వచ్చిన కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్‌తో గుర్తింపు సంపాదించుకున్న మయూర్, ఈ సిరీస్‌లో ఒకరకంగా లీడ్ రోల్ పోషించాడు. అతని పాత్రకు నటించే స్కోప్ ఎక్కువగా ఉండటంతో, నిజంగా ఆ క్రైమ్ చేసింది అతనేనా అనేలా ఒదిగిపోయాడు. ఇక పాలక్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి, కొన్ని చోట్ల కథ ఆమె చుట్టూ తిరిగేలా ఉన్న వెయిటేజ్ ఉన్న పాత్రలో అందంగా కనిపిస్తూనే, నటనతో ఆకట్టుకుంది. మరో నటుడు దేవన్ కూడా మంచి వెయిటేజ్ ఉన్న పాత్రతో ఆకట్టుకున్నాడు. తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ నటిస్తూ పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. నిజ జీవిత పాత్రలేమో అని అనుమానించేలా నటించిన వారి నటన సిరీస్‌కు ప్లస్ అయింది. ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు దాదాపు అన్ని ఫ్రేమ్‌లలో కనిపిస్తుంది. ఎక్కడా న్యాచురల్ ఫీల్ మిస్ కాకుండా సిరీస్ రూపొందించిన విధానం అభినందనీయం. సినిమాటోగ్రఫీ, అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సిరీస్‌కు ప్రధానమైన అసెట్స్‌గా నిలుస్తాయి. స్క్రీన్‌ప్లే మొదలు, సిరీస్ కోసం రాసుకున్న ట్విస్ట్‌లు ఆకట్టుకున్నాయి. ఇక దర్శకుడే ఎడిటర్ కావడంతో, ఎక్కడ ఏమి ఉండాలో కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, క్రిస్పీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
ఫైనల్‌గా, ఈ బ్లాక్ వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ అనే సిరీస్ ఓ మస్ట్-వాచ్ డాక్యుమెంటరీ క్రైమ్ డ్రామా.
తాజావార్తలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?