Uganda DNA Tests : ఆఫ్రికా దేశం ఉగాండాలో ఇప్పుడు DNA టెస్టుల వివాదం పెను తుఫాను సృష్టిస్తోంది. తాను గుండెల్లో పెట్టుకొని పెంచుతున్న పిల్లలు, అసలు తన రక్తమే కాదని తెలుసుకున్న భర్తల క్రైసిస్ ఇది. ఉగాండాలో ఏం జరుగుతోంది? దీని వెనుక ఉన్న సామాజిక ఒత్తిడి ఏంటి? ఉగాండా దేశం ఇప్పుడు పెటర్నిటీ ఫ్రాడ్‌తో (Paternity Fraud) వణికిపోతోంది. దేశవ్యాప్తంగా మెన్ అంతా DNA టెస్టుల కోసం ల్యాబ్‌ల ముందు క్యూ కడుతున్నారు. ఎందుకంటే… వాళ్లకు వస్తున్న రిపోర్ట్స్ అన్నీ నెగిటివ్..! తమ పిల్లలకు తాము ఫాదర్స్ కాదని తెలుసుకుని, వాళ్ల హార్ట్స్ బ్రేక్ అవుతున్నాయి..
ఈ అలజడి స్టార్ట్ అవ్వడానికి రెండు కీ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఒక రిచ్ మ్యాన్ తన ముగ్గురు పిల్లలకు టెస్ట్ చేయిస్తే, షాకింగ్‌గా ఎవరూ తన పిల్లలు కాదని తేలింది. సెకండ్ వన్, జాబ్స్ కోసం యూరోప్, మిడిల్ ఈస్ట్‌కు వెళ్లే వాళ్లకు వీసా రూల్స్ ప్రకారం, DNA ప్రూఫ్ కంపల్సరీ అయ్యింది. హ్యాపీగా వెళ్లిన వాళ్లు, రిపోర్ట్స్ చూసి కుప్పకూలిపోతున్నారు..
iBomma Case: నాలుగు గంటలుగా ఐబొమ్మ రవిని ప్రశ్నిస్తున్న సీపీ సజ్జనార్ !
ఉగాండాలో పితృస్వామ్య వ్యవస్థ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. పిల్లలు పుట్టకపోతే, లోపం మ్యాన్‌లో ఉన్నా సరే, సొసైటీ బ్లేమ్ చేసేది వైఫ్‌నే..! అంతేకాదు, పిల్లలు లేకపోతే ఆమెకు ఆస్తిలో వాటా దక్కదు.. అందుకే తమ పొజిషన్‌ను కాపాడుకోవడానికి, గౌరవం దక్కించుకోవడానికి, చాలా మంది వైఫ్స్ తమ హస్బెండ్‌కు తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది వాళ్లకు మోసం కాదు.. ఒక రకమైన సర్వైవల్ స్ట్రాటజీ..
ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి, దేశంలో ఫేక్ ల్యాబ్స్ పుట్టగొడుగుల్లా వచ్చాయి. డబ్బు కోసం, తండ్రి బిడ్డల DNA మ్యాచ్ అయినా సరే, మ్యాచ్ కాలేదని రాంగ్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి.. ఎందుకంటే, నెగిటివ్ వస్తే, ఆ తండ్రి మళ్లీ కన్ఫర్మేషన్ కోసం టెస్ట్ చేయించుకుంటాడు, అంటే డబుల్ ఇన్కమ్..! ఈ దుర్మార్గమైన బిజినెస్ వల్ల నిజమైన ఫాదర్స్ కూడా అనుమానంతో తమ పిల్లలను దూరం చేసుకుంటున్నారు. కంక్లూజన్ ఏంటంటే..సైన్స్ ట్రూత్ను మాత్రమే చెప్తుంది. కానీ ఆ ట్రూత్‌ను మోసే శక్తి అందరికీ ఉండదు. తప్పు ఎవరిదైనా, శిక్ష అనుభవిస్తున్నది మాత్రం ఆ పిల్లలే..!
Dharmendra : బాలీవుడ్ హీ మ్యాన్.. మతం మారి రెండు పెళ్లిళ్లు.. ధర్మేంద్ర బ్యాక్ గ్రౌండ్ ఇదే!