Site icon NTV Telugu

The Paradise : నాని.. ఏం డెడికేషన్ అబ్బా?

Dhi Paradise

Dhi Paradise

నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నానిలోని సరికొత్త యాంగిల్ ను తెలుగు సహా పాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘డి పారడైజ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఒక కీలక ఫైట్ సీన్ RFC లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్ లో ఈ 15 రోజుల లెంతీ ఫైట్ షెడ్యూల్ షూట్ చేశారు. ఈ ఫైట్ అద్భుతంగా కుదిరిందని ఫైట్ చూస్తుంటే గూజ్ బంప్స్ మూమెంట్స్ గ్యారెంటీ అని అంటున్నారు. నాని చాలా ప్యాషన్ , డెడికేషన్ తో కష్టపడి ఈ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేసినట్లుగా సమాచారం. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు సుమారు 15 రోజులపాటు ఇదే ఫైట్ సీక్వెన్స్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ లోకేషన్ అంతా దుమ్ముతో కూడి ఉంటుందని అక్కడ కాసేపు ఉండడమే ఇబ్బంది అనుకుంటే నాని ఏకంగా 15 రోజులు పాటు అలా షూటింగ్లో పాల్గొనడం ఆయన డెడికేషన్ కి నిదర్శనం అని చెప్పొచ్చు.

Also Read: Akhanda 2: గూజ్ బంప్స్ స్టఫ్ లోడింగ్.. పోటీ పడుతున్న ఓటీటీలు!

ఇక సినిమాలో నాని లుక్ ఎలా ఉంటుందో, ఇప్పటికే మనకి క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ ఫైట్‌లో కూడా అలాంటి లుక్‌తోనే నాని ఉంటాడని అంటున్నారు. ఈ ఫైట్ లొకేషన్ చూసిన వారు నాని డెడికేషన్‌కు హ్యాట్స్‌ఆఫ్ చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే, ఆ స్థాయిలో ఈ సినిమా ఫైట్‌ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడా వెనక్కి తగ్గకుండా శ్రీకాంత్ ఓదెల ఈ ఫైట్‌ను ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. కేవలం ఈ ఫైట్ ఒక్కటే కాదు సినిమాలోని అన్ని యాక్షన్ బ్లాక్స్ ను ఇదే లెవల్ లో ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.

Also Read:Disha Patani : అందాల ఆరబోతలో దయ లేని దిశా పటాని

రియల్ సతీష్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్‌లో కొంతమంది ఇంటర్నేషనల్ ఫైట్ కంపోజర్లు పాల్గొన్నారు. సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో, ఈ ఫైట్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. నిజానికి, ‘దసరా’ క్లైమాక్స్ సీక్వెన్స్ ఒక్కసారిగా హై ఇచ్చేలా శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేశాడు. దానికి మించి ఈ ఫైట్‌తో హై ఇస్తాడని టీమ్ చెబుతోంది. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version