తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటి చెప్పిన ఘనత రాజమౌళికి కచ్చితంగా దక్కుతుంది. ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్ మొత్తాన్ని అవగతం చేసుకుని, తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ చేస్తున్నాడు. మహేష్ బాబుతో ఆయన చేస్తున్న సినిమాని ప్రస్తుతం గ్లోబ్ ట్రాక్టర్ అనే పేరుతో సంబోదిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. తాజాగా ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా అక్కడ ముగించారు. అయితే, అనూహ్యంగా నిన్న రాత్రి నుంచి ఈ సినిమా ఏకంగా 125దేశాలలో రిలీజ్ అవుతుందనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. వాస్తవానికి ఈ సినిమా గురించి మహేష్ బాబు పుట్టినరోజు నాడు తప్ప, రాజమౌళి ఎప్పుడూ స్పందించలేదు.
Also Read:Samantha: సమంత పట్టుకున్న ‘ఆ’ చేయి రాజ్ దేనా?
కానీ, నిన్న సాయంత్రం నుంచి 120 కంట్రీస్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది, హాలీవుడ్ సంస్థలు సినిమాకి భాగస్వామ్యం చేస్తున్నాయి అంటూ ప్రచారం మొదలైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇటీవల పారడైజ్ సినిమాకి పనిచేసినట్లు ప్రకటించబడిన అమెరికన్ హాలీవుడ్ బి ఎస్ ప్రమోషన్ ఏజెన్సీ, కనెక్ట్ మాబ్ స్టోర్, రాజమౌళి సినిమాకి కూడా పనిచేస్తుందని ప్రచారం మొదలైంది. నిజానికి రాజమౌళి తనదైన శైలిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తూ, సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే, రాజమౌళికి సంబంధం ఉండి ఈ ప్రచారం మొదలైందా, లేక ఆయన దృష్టిలో లేకుండానే ప్రచారం మొదలైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read:Soubin Shahir: ఫైనాన్షియల్ ఫ్రాడ్.. మంజుమ్మల్ బాయ్ కి షాక్
ఎందుకంటే, జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన అవతార్ టూ ఇప్పటివరకు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫిలిం రిలీజ్ అని చెప్పొచ్చు. కానీ, ఆ సినిమా ఫస్ట్ వీక్‌లో కేవలం 49 గ్లోబల్ మార్కెట్స్‌లో మాత్రమే రిలీజ్ అయింది. సాధారణంగా ఇండియన్ సినిమాలకు ఓవర్సీస్ అంటే నార్త్ అమెరికా, యూకే, జపాన్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా సహా గల్ఫ్ కంట్రీస్‌తో పాటు ఫ్రాన్స్ మాత్రమే ఉంటుంది. ఆఫ్రికన్ కంట్రీస్‌లో కూడా రిలీజ్ చేస్తారు, కానీ అది పెద్ద నెంబర్ ఏమీ కాదు. కేవలం ఒక 12 దేశాల్లో రిలీజ్ ఉంటుంది, అది కూడా నామమాత్రంగానే. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో 120 కంట్రీస్ అనేది రాజమౌళి ప్లాన్ కాదని, కేవలం సోషల్ మీడియా హైప్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాని కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
