అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగా అనూహ్యంగా వార్తల్లోకి వచ్చాడు. నిజానికి స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పుకుందనే వార్త ముందు వెలుగులోకి వచ్చింది. దానికి దీపికా పెట్టిన కొన్ని కండిషన్స్ కారణమని కూడా అన్నారు. దీపికా పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను ప్రాజెక్టు నుంచి వెళ్లిపోమని కోరారని, దాంతో ఆమె వెళ్లిపోయిందని బయటకు తెలిసింది. అంతేకాదు, అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలో బోల్డ్ క్యారెక్టర్‌లో…