Ebola Vaccine: గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. ఎబోలా కొత్త స్ట్రెయిన్‌కు వ్యాక్సిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎబోలా కొత్త స్ట్రెయిన్‌కు చెక్ పెట్టేందుకు కొత్త వ్యాక్సిన్ కనిపెట్టామంటోంది రష్యా. కాంగో, యుగాండాలో వ్యాపిస్తున్న బుండిబుగ్యో ఎబోలా స్ట్రెయిన్ పనిపట్టేందుకు సిద్ధమైనట్టు చెప్పుకొస్తోంది. ఈ స్ట్రెయిన్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో రష్యా ఒక సంచలన ప్రకటన చేసింది. కొత్త ఎబోలా స్ట్రెయిన్‌పై పనిచేసే వ్యాక్సిన్‌ను తమ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని ప్రకటించింది.
ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న చాలా ఎబోలా వ్యాక్సిన్లు జైర్ ఎబోలా వైరస్‌పై మాత్రమే పనిచేస్తాయి. కానీ ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న బుండిబుగ్యో స్ట్రెయిన్‌పై సరైన వ్యాక్సిన్ లేకపోవడం ప్రపంచ ఆరోగ్య సంస్థకు పెద్ద ఆందోళనగా మారింది. ఇంతలోపే రష్యా చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read
- Karnataka Power Tussle: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించింది?
- Iran Vs America War: 3 నెలలు.. తె*గిపడ్డ వేలాది తలలు..అంతర్జాతీయ మీడియా షాకింగ్ నివేదిక!
- Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
- Kollywood: నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు?
అయితే ఈ వ్యాక్సిన్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎబోలా అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మనిషి శరీరాన్ని లోపల నుంచి నాశనం చేసే అత్యంత ప్రమాదకర వైరస్లలో ఎబోలా ఒకటి.
మొదటిసారి 1976లో ఆఫ్రికాలోని కాంగో ప్రాంతంలో ఈ వైరస్‌ను గుర్తించారు. ఆ ప్రాంతంలో ఉన్న ఎబోలా నది పేరు మీదే దీనికి ఎబోలా అనే పేరు వచ్చింది. ఈ వైరస్ సహజంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. అడవి జంతువుల మాంసం తినడం లేదా వాటిని తాకడం వల్ల మనుషులకు సోకుతుంది。అంతేకాదు ఎబోలా సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట, మూత్రం, లేదా ఇతర శరీర ద్రవాలు నేరుగా మరొకరి శరీరంలోకి ప్రవేశించడం వల్ల వ్యాపిస్తుంది.
వైరస్ సోకిన తర్వాత ఏమౌతుంది?
ఈ వైరస్ సోకిన తర్వాత మొదట జ్వరం వస్తుంది. తర్వాత తీవ్రమైన అలసట, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు మొదలవుతాయి. పరిస్థితి మరింత విషమిస్తే శరీరంలో అంతర్గత రక్తస్రావం ప్రారంభమవుతుంది. కళ్ల నుంచి, ముక్కు నుంచి, నోటిలో నుంచి రక్తం రావచ్చు. చాలా సందర్భాల్లో రోగి కొన్ని రోజుల్లోనే మరణిస్తాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎబోలా మరణాల రేటు 25 శాతం నుంచి 90 శాతం వరకు ఉండొచ్చు. అంటే కొన్నిసార్లు కరోనా కంటే ఎన్నో రెట్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.
ఆఫ్రిక సమస్య మాత్రమే కాదు:
ఇప్పటివరకు ప్రపంచం చూసిన పెద్ద ఎబోలా సంక్షోభాల్లో 2014వ సంవత్సరం నిలుస్తోంది. గిని, లైబీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో వేల మంది మరణించారు. ఆస్పత్రులు నిండిపోయాయి. డాక్టర్లు కూడా వైరస్ బారిన పడ్డారు. ఆ సమయంలో ప్రపంచం ఎబోలాను కేవలం ఆఫ్రికా సమస్యగా చూడలేదు. ఎందుకంటే అంతర్జాతీయ ప్రయాణాలు పెరిగిపోయిన ఆ కాలంలో వైరస్ సరిహద్దులు చూడదు. అప్పుడే వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా భారీ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. తర్వాత ఎర్వీబో అనే వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఇది జైర్ ఎబోలా వైరస్‌పై మంచి ఫలితాలు ఇచ్చింది. తర్వాత జాబ్డెనో, మ్వాబియా లాంటి ఇతర వ్యాక్సిన్లు కూడా వచ్చాయి. కానీ సమస్య ఏంటంటే ఇవన్నీ ఒకే రకమైన ఎబోలా స్ట్రెయిన్‌పై మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు కాంగోలో వ్యాప్తి చెందుతున్న బుండిబుగ్యో స్ట్రెయిన్ పై ఇవి పూర్తిగా పనిచేస్తాయా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు.
ఇదే సమయంలో రష్యా చేసిన ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకారం తమ శాస్త్రవేత్తలు కొత్త ఎబోలా స్ట్రెయిన్ పై పనిచేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా బుండిబుగ్యో స్ట్రెయిన్ నుంచి కూడా ఇది రక్షణ కలిగించవచ్చని చెబుతున్నారు.
కీలక మలుపు కానుందా?
ప్రస్తుతం ప్రపంచంలో ఈ స్ట్రెయిన్‌పై అధికారికంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ లేదు. అందుకే ఈ ప్రకటనను చాలా దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. రష్యా నిజంగానే పెద్ద సైంటిఫిక్ బ్రేక్ త్రూ సాధించిందా లేక ఇది ఇంకా ప్రారంభ దశలో ఉన్న ప్రయోగమా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన పూర్తి క్లినికల్ ట్రయల్స్ డేటా బయటకు రాలేదు. పీర్ రివ్యూడ్ జర్నల్స్‌లో కూడా వివరాలు ప్రచురించలేదు. అందుకే ప్రపంచ ఆరోగ్య నిపుణులు జాగ్రత్తగా స్పందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రపంచం ఒక విషయం గమనించింది.
వ్యాక్సిన్ తయారు చేయడం ఒక్కటే సరిపోదు. అది సురక్షితమా కాదా అన్నది నిరూపించాలి. లక్షల మందిపై పరీక్షలు చేయాలి. చెడు ప్రభావాలు ఉన్నాయా.. లేదా చూడాలి. వైరస్ కొత్త వేరియంట్లపై కూడా అది పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ విషయంలో కూడా అదే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ మరోవైపు ప్రపంచం ముందు ఒక పెద్ద వాస్తవం కూడా ఉంది.
బుండిబుగ్యో స్ట్రెయిన్‌పై ఇప్పటివరకు సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదు. అందుకే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ మెడికల్ బ్రాంచ్, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ వంటి సంస్థలు కూడా కొత్త వ్యాక్సిన్లపై పరిశోధనలు వేగవంతం చేస్తున్నాయి. అంటే ఇది కేవలం రష్యా మాత్రమే చేస్తున్న పోరాటం కాదు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు సమయంతో పోటీ పడుతున్నారు.
మరోవైపు ప్రస్తుతం కాంగోలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. వందల సంఖ్యలో నిర్ధారిత కేసులు బయటపడ్డాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ పరిస్థితిని అత్యంత ప్రమాదకరంగా ప్రకటించింది. ఎందుకంటే ఆఫ్రికాలో ఆరోగ్య సదుపాయాలు చాలా ప్రాంతాల్లో బలహీనంగా ఉంటాయి. ఒకసారి వైరస్ గ్రామాల నుంచి నగరాలకు చేరుకుంటే నియంత్రించడం కష్టం అవుతుంది.
ముఖ్యంగా ఎబోలా వైరస్ రోగి శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. అంటే కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది, అంత్యక్రియల్లో పాల్గొనేవారికి ప్రమాదం ఎక్కువ. అందుకే వేగంగా గుర్తించడం, రోగులను వేరుచేయడం, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం చాలా కీలకం. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా రష్యా ప్రకటించిన వ్యాక్సిన్ నిజంగా పనిచేయాలని కోరుకుంటోంది. ఒకవేళ ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే చరిత్రలో ఇది పెద్ద మలుపు కావచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి కొత్త ఎబోలా స్ట్రెయిన్ వచ్చినప్పుడు ప్రపంచం మళ్లీ మొదటి నుంచి పోరాటం ప్రారంభించాల్సి వచ్చేది. కానీ మల్టిపుల్ స్ట్రెయిన్లపై పనిచేసే వ్యాక్సిన్ వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు.
అయితే సైన్స్ ప్రపంచంలో ఒక నియమం ఎప్పుడూ ఉంటుంది. ప్రకటనలకంటే ఆధారాలకే విలువ ఎక్కువ. అందుకే ఇప్పుడు ప్రపంచం రష్యా నుంచి పూర్తి డేటా కోసం ఎదురుచూస్తోంది. కరోనా తర్వాత మరో మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుందా లేదా ఈసారి విజ్ఞానం ముందుగానే గెలుస్తుందా అన్నది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది.
తాజావార్తలు
-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
-
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
-
BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
-
Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
-
RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..