పెళ్లి అనేది ఒక అద్భుతమైన బంధం.. మూడు ముళ్లతో వందేళ్లు కలిసి బ్రతికె అద్భుతమైన ఘట్టం.. అందుకే ఈ బంధానికి జనాలు విలువ ఇస్తారు.. ఈ బంధంలో ప్రేమ, రాజీ, అవగాహన, గౌరవం ఉండాలి. అలాగే దంపతుల మధ్య హెల్దీ రిలేషణ్ ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో అది కనిపించడం లేదని తెలుస్తోంది! తాజాగా యువకుల్లో పెళ్లి భయం పుట్టుకు వస్తోంది. పెళ్లి తర్వాత ఫ్రీడమ్ ఉండదేమో? కెరీర్ కాంప్రమైజ్ చేయాల్సి వస్తుందేమో? వచ్చే పార్టనర్ ఎలా ఉంటారో? ఇలాంటి భయాల వల్లే చాలామంది పెళ్లికి దూరంగా ఉంటున్నారట. పెళ్లికి ముందు ఇలాంటి భయాలు ఉండడం మామూలే కానీ ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలో భయం కాస్త పెరుగుతోంది.
READ MORE: Margani Bharat: బాబు షూరిటీ ఎక్కడ ఉందని ప్రజలు అడుగుతున్నారు..
యూపీలో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసు కేసు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అతడి భార్య ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సౌరభ్‌తో కలిసి దారుణంగా చంపేసింది. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రియుడి కోసం భర్తలను హత్య చేసే పరంపర కొనసాగుతూ వస్తోంది. ఈ విష సంస్కృతి తాజాగా తెలుగు రాష్ట్రాలకు సైతం పాకింది. ఏపీ, తెలంగాణలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల తెలంగాణాలోని గద్వాల జిల్లా పరిధిలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు సంచలనం సృష్టించింది. బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర బంధం పెట్టుకున్న భార్య ఐశ్వర్య భర్తను దారుణంగా చంపించేసింది. గత నెల 23న నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందని రాధ తన భర్త అంజిలప్పను గొంతునులిమి హత్య చేసింది. ఈ హత్యకు కారణం వివాహేతర బంధామే అని తాజాగా బయటపడింది.
READ MORE: Raj Thackeray: ఠాక్రేలను కలపడానికి, బాలాసాహెబ్ చేయలేనిది ఫడ్నవీస్ చేశారు..
ఇలాంటి వరుస ఘటనతో యువతలో భయం పెరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం పెళ్లి, వివాహేతర బంధాలు, భర్తను భార్యలు హత్య చేయించిన కేసులపై చర్చ జరుగుతోంది. “సింగిల్ లైఫ్ సో బెటర్” అని యువకులు భావిస్తున్నారు. ఒకప్పుడు భార్యలు తమ భర్తల మాటలను జవదాటే వాళ్లు కాదు.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. దానికి ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోవడమే.. పెళ్లి జరిగిన వెంటనే భార్యభర్తలు వేరే కాపురం పెట్టేస్తున్నారు. పల్లేలు వదిలి సిటీకి పయణమవుతున్న వాళ్లు కొందరైతే మరికొందరు అదే గ్రామంలో విడిగా జీవిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కుటుంబంలో పెరగడం వల్ల, పిల్లలకు సమాజంలో ఎలా మసలుకోవాలో తెలుస్తుంది. ఇతరులతో ఎలా కలిసి ఉండాలో నేర్చుకుంటారు. వివిధ వయసుల వ్యక్తులతో కలిసి ఉండటం వల్ల సామాజికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. పిల్లల సంరక్షణ, విద్యలో పెద్దలు సహాయం చేస్తారు. తాతయ్యలు, నానమ్మలు పిల్లలకు కథలు చెప్పడం, ఆటలు ఆడటం వంటివి చేస్తారు. ఇది పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. వారిని చెడు అలవాట్లు దరి చేరకుండా ఉంటాయి.
READ MORE: Nehal Modi: పీఎన్‌బీ బ్యాంకు మోసం కేసు, అమెరికాలో నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీ అరెస్ట్..
ఉమ్మడి కుటుంబంలో జీవించడం వల్ల విడాకులు, ఆత్మహత్యలు ఉండవు. వివాహేతర బంధాలు పెట్టుకోవాలనే ఆలోచన దరి చేరదు. ఇలాంటి బంధాలు పెట్టుకుంటే కుటుంబీకులు ఏం అనుకుంటారో..? గ్రామస్థులు తప్పపడతారు అనే భయం ఉంటుంది. తరచూ పెద్దలు చెప్పే మాటలు ఆడవాళ్లు వింటారు. ఈ కుటుంబాల్లో స్త్రీలకు గౌరవం, హుందాతనం లభిస్తుంది. భార్యభర్తలు ఇద్దరు మాత్రమే జీవిచండం వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి.. ఉమ్మడి కుటుంబాలకు మద్దతు పలికి పూర్వ వైభవం తీసుకురండి..
