Peddi : ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!

Peddi Trailer

Peddi Trailer

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ అప్‌డేట్ వచ్చేసింది, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న భారీ రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషన్స్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కి చేరుకున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, రెండు సాంగ్స్, చరణ్ రెండు విభిన్న షేడ్స్‌ను చూపించిన గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ లాంచ్ డేట్‌ను అనౌన్స్ చేసి మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు కేవలం రామ్ చరణ్ లుక్స్‌పైనే ఫోకస్ పెట్టిన మేకర్స్, ఈ ట్రైలర్‌తో సినిమా అసలు కథేంటి? చరణ్ పాత్రలోని లోతులేంటి? అనేది రివీల్ చేయబోతున్నారు. ముంబైలో ఈ ఈవెంట్ ప్లాన్ చేయడం ద్వారా నేషనల్ వైడ్ మార్కెట్‌ను ‘పెద్ది’ టీమ్ టార్గెట్ చేస్తోంది.

ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను, లుక్‌ను పూర్తిగా మార్చేశారు. మల్టిపుల్ టైమ్ లైన్స్‌లో సాగే ఈ కథలో ఆయన రగ్గడ్ లుక్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కావడంతో చరణ్ ఫిజికల్ మేకోవర్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. ఇప్పటికే వచ్చిన పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ లాంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇంతమంది స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ ఆకాశాన్ని తాకుతోంది. సినిమా రిలీజ్‌కు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో ‘పెద్ది’ సునామీ సృష్టిస్తోంది. అక్కడ ప్రీ-సేల్స్ అసాధారణ రీతిలో జరుగుతున్నాయి. ప్రత్యంగిర సినిమాస్ ఓవర్సీస్ పంపిణీ బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా ఉండబోతోంది.