Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో ఊచకోత కోయబోతోందో చెప్పడానికి ఒక చిన్న శాంపిల్ బయటకు వచ్చింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి.. మే 23న భోపాల్ వేదికగా జరగబోయే మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ కోసం మేకర్స్ పెడుతున్న ఖర్చు, ప్లానింగ్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్‌కే కాదు, సగటు సినీ ప్రేక్షకుడికి కూడా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మే 23న జరగబోయే #PEDDI గ్రాండ్ సెలబ్రేషన్స్‌లో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ లైవ్ కాన్సెర్ట్ కోసం దేశంలోనే ముందెన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన టెక్నాలజీ, మ్యూజికల్ ఎక్విప్మెంట్ను వాడుతున్నారు.
దాదాపు ₹150 కోట్ల విలువైన భారీ ఎక్విప్మెంట్ను ప్రత్యేకంగా ముంబై నుండి తరలిస్తుండగా.. ఈ సెటప్ కోసం కేవలం అద్దె రూపంలోనే రోజుకు ₹1 కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారట. దీన్ని బట్టే ఈ సినిమాపై, ఈ మ్యూజికల్ నైట్పై మేకర్స్ ఎంత నమ్మకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మే 23న సాయంత్రం 5 గంటల నుండి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల ‘బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్’ (BHEL Dussehra Ground)లో ఈ భారీ గ్రౌండ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేదికపైనే సినిమాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పెషల్ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు. ‘యూవీ మీడియా’ సంస్థ ఈ ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, గ్రాండ్‌గా ఆర్నగైజ్ చేస్తోంది. ఈ మెగా మ్యూజికల్ జాతరను లైవ్‌లో చూడాలనుకునే వారి కోసం మే 20 (బుధవారం) నుండి ఈవెంట్ జరిగే వేదిక (BHEL Dussehra Ground, Bhopal) వద్ద ఉచిత పాస్‌లను పంపిణీ చేయనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ స్వాగ్, ఎ.ఆర్. రెహమాన్ మ్యాజికల్ లైవ్ కలుస్తుండటంతో భోపాల్ వేదికగా మే 23న ఇండియన్ స్క్రీన్‌పై సరికొత్త చరిత్ర లిఖించబడటం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
-
Kishan Reddy : ఓట్ల చోరీ చేయం.. మనసులే గెలుస్తాం
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?