రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ‘SSMB 29’ అని, గ్లోబ్ ట్రాట్టింగ్ మూవీ అని రకరకాలుగా పిలుస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం చాలా సీక్రెట్‌గా జరిపించారు రాజమౌళి. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో చాలా సీక్రెట్‌గా, పగడ్బందీగా ఓపెనింగ్ జరిపి, ఆ రోజు నుంచే కొన్నాళ్లపాటు షూటింగ్ కూడా జరిపారు. ఇటీవలే ఒక షెడ్యూల్ షూటింగ్ కోసం కెన్యా కూడా వెళ్లి వచ్చింది టీమ్.
Also Read :Lokesh Kanagaraj: కమల్ – రజనీ వద్దనుకున్న సినిమా పవన్-ప్రభాస్ తో!
ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నవంబర్ 15వ తేదీన హైదరాబాద్ వేదికగా ఈ సినిమాకి సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నారు రాజమౌళి. కే.ఎల్. నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈవెంట్‌లో సినిమాకి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా రాజమౌళి తన సినిమాలు మొదలుపెట్టేముందు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, సినిమా ఎలా ఉంటుందో ముందే చెప్పేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈవెంట్ నిర్వహించడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియదు. నవంబర్ 15వ తేదీ జరగాల్సిన ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటినుంచే ఏర్పాట్లు ప్రారంభమైనట్లుగా సమాచారం