Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య.. ఓ ప్రమోషన్ స్టోరీ!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Tarun Lavanya Story Became Promotional Stunt: హీరో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి ఆయన పేరు ఎన్నిసార్లు మీడియాలో వినిపించిందో తెలియదు కానీ అంతకు ఎక్కువగానే గత రెండు -మూడు నెలల్లో వినిపించింది.. ఆయన తనతో సహజీవనం చేసి రెండు మూడుసార్లు కడుపు కూడా తీయించి ఇప్పుడు మోసం చేసి మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని లావణ్య అనే యువతి ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చింది. ఆ మీడియా ముందుకు రావడం కూడా తిరగబడరా సామి అనే సినిమా ట్రైలర్ లాంచ్ చేసి ప్రమోషన్స్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో వచ్చింది. ఆ రావడం మొదలు లావణ్య రాజ్ తరుణ్ మీద చేసిన ఆరోపణలు, రాజ్ తరుణ్ లావణ్య మీద చేసిన ఆరోపణలు మధ్యలో మాల్వి మల్హోత్రా కేసు పెట్టడం ఇలా అనేక మలుపులు తిరిగి అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆ తర్వాత పురుషోత్తముడు అనే సినిమా అవుట్ ఆఫ్ సిలబస్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. మళ్లీ తిరగబడరా సామి ప్రెస్ మీట్ జరుగుతున్న వేదిక వద్దకు లావణ్య వచ్చి రచ్చ రచ్చ చేసింది..
Also Read
ఇప్పుడు అటు లావణ్య చల్లబడిపోయింది ఇటు రాజ్ తరుణ్ కూడా చల్లబడిపోయాడు.. అయితే ఆ వివాదం మొదలైన తర్వాత ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. భలే ఉన్నాడే అనే సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత సుబ్రహ్మణ్యం హలో వరల్డ్ లాంటి వెబ్ సిరీస్ లకు డైరెక్షన్ చేసిన శివ సాయి వర్ధన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అతనికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ కి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే ఇదంతా చూస్తుంటే రాజ్ తరుణ్ సినిమాలు వరుసగా వస్తున్న సమయంలో ఆయన సినిమాలను ప్రమోట్ చేసేందుకు లావణ్య ఇలా చేసిందేమో అనిపిస్తోంది, మీరిద్దరూ కలిసే ఇది చేసినట్టుగా అనిపిస్తుంది అంటూ ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో అసలు ఇలాంటి ప్రమోషన్స్ ఎవరైనా చేస్తారా అంటూ రాజ్ తరుణ్ షాక్ అయ్యాడు.
వెంటనే మీరు అడిగిన ప్రశ్న జీర్ణించుకోవడానికి కష్టంగా ఉందని అన్నాడు. నిజానికి వ్యక్తిగత జీవితాన్ని ఇలా రచ్చ చేసుకోవడానికి ఏ హీరో ఇష్టపడడు. అలాంటిది దీన్ని ప్రమోషన్ గా ఎలా ఫీలయ్యారో తెలియదు. కానీ రాజ్ తరుణ్ భలే ఉన్నాడే డైరెక్టర్ మాత్రం ఈ విషయంలో ఒక పొరపాటు చేసినట్లు కనిపిస్తోంది. అదేంటంటే భలే ఉన్నాడే సినిమా ప్రమోషనల్ స్టంట్ గా ఒక ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న యువతి చేత అతనికి విషయం లేదు, కానీ భలే ఉన్నాడే అని మా ఫ్రెండ్ మాయలో పడింది. కానీ అతనికి విషయం లేదు అన్నట్టుగా వీడియో చేయించారు. దాన్ని రిలీజ్ చేసిన వెంటనే ఎవరో లావణ్య ఫ్రెండ్ అయ్యుంటుంది, ఇదంతా లావణ్య చేయించిందని కూడా భావించారు.
తర్వాత లావణ్య స్వయంగా ఇది నాకు సంబంధించిన వీడియో కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం వారి పర్సనల్ ట్రాజెడీ కంటే ఎక్కువగా ఒక ప్రమోషనల్ స్టంట్ లా మారిపోయింది అనే అనుమానాలకు కూడా తావిచ్చే పరిస్థితులు ఏర్పడడం కాస్త ఇబ్బందికర అంశమే. సెలబ్రిటీలు కూడా మనుషులే, వాళ్ళ జీవితాలలో కూడా పర్సనల్ విషయాలు ఉంటాయి. వాటి జోలికి మీడియా, సోషల్ మీడియా వెళ్లనంతవరకు అన్నీ బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి ఆ వ్యవహారాలు బయటకు వచ్చిన తర్వాత అందరి దృష్టి అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి సెలబ్రిటీలుగా భావించే వారంతా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక రకంగా రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ ఒక మంచి ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!