సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘SSMB29’ గురించి రోజుకో కొత్త వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుందని తాజా సమాచారం. అంతేకాదు, ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా లవర్‌గా కనిపించనున్నాడని కూడా టాక్ నడుస్తోంది. అయితే, ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాని నేపథ్యంలో ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజమౌళి తన సినిమాల్లో కేవలం కథ, నటన, టెక్నికల్ అంశాల్లోనే కాకుండా సెట్‌లో క్రమశిక్షణ మరియు పర్యావరణ పరిరక్షణలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని మరోసారి నిరూపితమైంది. ‘SSMB29’ షూటింగ్ లొకేషన్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నిర్ణయంతో షూటింగ్ స్థలాన్ని పొల్యూషన్ ఫ్రీగా మార్చేందుకు యూనిట్ సభ్యులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు రాజమౌళి. పర్యావరణ సంరక్షణపై ఈ చిత్ర బృందం చూపిస్తున్న చొరవ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Ranya Rao: నవంబర్‌లో వివాహం, డిసెంబర్‌లో విడిపోయాం.. కోర్టులో చెప్పిన రన్యా రావు భర్త
కఠిన నిబంధనలతో షూటింగ్
ఈ సినిమా షూటింగ్ సెట్‌లో రాజమౌళి అమలు చేస్తున్న స్ట్రిక్ట్ రూల్స్ కూడా హాట్ టాపిక్‌గా మారాయి. హీరో మహేష్ బాబుకు ఇద్దరు అసిస్టెంట్లు, ప్రియాంక చోప్రాకు ఇద్దరు అసిస్టెంట్లకు మాత్రమే లొకేషన్‌లో పర్మిషన్ ఇవ్వగా, మిగతా ఆర్టిస్టులకు ఒక్కొక్కరికి ఒక అసిస్టెంట్ మాత్రమే అనుమతించారు. నిజానికి ప్రియాంక చోప్రాకు మేకప్ మరియు వ్యక్తిగత సహాయకులుగా సాధారణంగా 13 మంది ఉంటారు కానీ, ఈ సెట్‌లో కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉండటం విశేషం. ఈ నిబంధనలు షూటింగ్ సమయంలో అనవసరమైన రద్దీని తగ్గించి, క్రమశిక్షణను పాటించేలా చేయడంలో భాగంగా పెట్టి ఉంటారని అంటున్నారు.
సినిమాపై ఉత్కంఠ
‘SSMB29’ ఒక జంగిల్ అడ్వెంచర్ జోనర్‌లో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో షూటింగ్ జరుగుతుండగా, ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా నెగిటివ్ రోల్‌లో కనిపిస్తుందనే వార్తలు నిజమైతే, ఆమె ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో రొమాంటిక్ యాంగిల్‌ను కూడా పంచుకోవచ్చని అంచనాలు వేస్తున్నారు. అయితే, ఈ విషయాలపై రాజమౌళి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.