Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్, గతంలో ‘ఆదిపురుష్’ లాంటి డిజాస్టర్ సినిమా చేసిన దర్శకుడు ఓం రౌత్‌తో మరో సినిమా చేయబోతున్నారంటూ ఈరోజు ఉదయం నుంచి ప్రచారం మొదలైంది. బాలీవుడ్లో మొదలైన ఈ ప్రచారం చివరికి అన్ని భాషల్లోనూ రకరకాల హెడ్డింగ్లతో వార్తలు వండి వార్చే వరకు చేరింది.
ఓం రౌత్ ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపథ్యంలో కథ చెప్పాడని, అది ప్రభాస్‌కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని రమ్మని చెప్పారంటూ ఈ ప్రచారం సాగుతోంది. అయితే ఇదే విషయం మీద ఎన్టీవీ, ప్రభాస్ పీఆర్ టీమ్‌ని సంప్రదించే ప్రయత్నం చేసింది. అయితే ఈ విషయమేమీ నిజం కాదని వారు పేర్కొన్నారు.
Also Read
- Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్... డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త "మైండ్ గేమ్"!
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
- Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
వాస్తవానికి ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికన్నా ఎక్కువగా దర్శకుడు ఓం రౌత్ టార్గెట్ అయ్యాడు. గ్రాఫిక్స్ మొదలుకొని ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ సహా సినిమాలో కనిపించిన చాలామంది నటీనటుల లుక్స్ విషయంలో కూడా టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలో అసలు ప్రభాస్ మరోసారి అతనికి అవకాశం ఇస్తాడా? అంటూ కొందరు అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఎవరో కావాలని పుట్టించిన ఒక రూమర్ తప్ప ఇందులో నిజం లేదని తేలిపోయింది.
తాజావార్తలు
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
-
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!