Kannappa : కన్నప్ప.. ఆ నలుగురు ఎక్కడప్పా..?
- దూరంగా ఉంటున్న ఆ నలుగురు
- కావాలనే సైలెంట్ అయ్యారా
- అసలు కారణం వేరే ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : కన్నప్ప తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మంచు విష్ణు అంటున్నాడు. దాన్ని ఎక్కువ మందికి చూపించడం కోసమే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ లను తీసుకున్నామని చెబుతున్నారు. సరే.. మంచు విష్ణు అడిగాడనో లేదంటే మోహన్ బాబు కోసమో ఆ నలుగురు ఈ మూవీలో నటించారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. మరి ప్రమోషన్లకు ఎందుకు రావట్లేదు. ఒక మూవీని తీయడం ఒక ఎత్తు అయితే.. దాన్ని ప్రమోషన్లు చేసి జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ నలుగురు ప్రమోషన్లు చేస్తే మూవీ హైప్ ఎక్కడికో వెళ్లిపోయేది. ఇప్పటి వరకు విష్ణు, మోహన్ బాబు మాత్రమే ప్రమోషన్లు చేసుకుంటున్నారు. కానీ ఈ నలుగురు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు.
Read Also : Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా..
Also Read
అసలు సినిమాతో వాళ్లకు సంబంధమే లేదన్నట్టు ఒక్క పోస్టు కూడా పెట్టట్లేదు. సినిమాలో సాధారణ పాత్ర చేసిన వారు కూడా ఏదో ఒక ఈవెంట్ కు అయినా వస్తారు. వీరు ముగ్గురూ కీలక పాత్రలు చేసినా ఒక్క ఈవెంట్ కు రాలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తాడని ఆశించినా అది జరగలేదు. మూవీకి ప్రీ రిలీజ్ కంటే పెద్ద ఈవెంట్ ఇంకొకటి ఉండదు. మరి దానికే ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా రాలేదంటే.. ఇక ముందు వస్తారన్న గ్యారెంటీ అసలే లేదు.
కన్నప్పపై అంతో ఇంతో బజ్ ఏర్పడిందే ఈ నలుగురి వల్ల. ఈ నలుగురు వచ్చి కన్నప్పను చూడాలని చెబితే వారి ఫ్యాన్స్ కచ్చితంగా చూసేస్తారు. దాని వల్ల ఓపెనింగ్ బాగా వచ్చే ఛాన్స్ ఉండేది. కానీ ఏం లాభం.. ఇప్పుడు ఏ దిక్కులేదు. ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రాజాసాబ్, ఫౌజీ పనులతో పాటు స్పిరిట్ మూవీని కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ దొరకట్లేదు. కాబట్టి రెబల్ వస్తాడనే నమ్మకం లేదు. అటు అక్షయ్ కుమార్ ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేయలేదు.
మోహన్ లాల్ తన సినిమా పనుల్లో బిజీ.. బిజీ. అటు కాజల్ అయితే ముంబై వదిలి రావట్లేదు. ఈ నలుగురు రాకపోవడానికి మరో కారణం ఉందనేది మరో ప్రచారం. కన్నప్ప లాంటి సినిమాలో నటించడం వల్ల జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ అంటున్నారంట వారి ఫ్యాన్స్. ఈ సినిమాలో తమ పాత్రల పట్ల కొంత అసంతృప్తిగానే ఉన్నారంట ఈ నలుగురు. ఆ కారణాలతోనే మూవీని ఎక్కువగా ప్రమోట్ చేస్తే చివరకు తమకే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఆ కారణాలతోనే మూవీని వారు భుజాన వేసుకోవట్లేదని సమాచారం. ప్రమోషన్లు చేశాక మూవీ రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా ఆ ఎఫెక్ట్ తమ మీదకే వస్తుందనేది వారి ఆలోచన. అందుకే కన్నప్పలో మోహన్ బాబు మాట కాదనలేక నటించినా.. ప్రమోషన్లకు మాత్రం ఏదో ఒక సాకు చూపించి దూరంగానే ఉంటున్నారనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.
Read Also : Thuglife : థగ్ లైఫ్ 3రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!