Nani: ది ప్యారడైజ్‌లోకి అడుగు పెట్టేది అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని హీరోగా నటించిన హిట్ థర్డ్ కేస్ అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం, రెండో రోజు 29 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే, ది ప్యారడైజ్ షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. అయితే, ఇంకా హిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో నాని షూట్‌లో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలోనే నాని చిన్ననాటి ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాని అమెరికా ప్రమోషన్స్ కోసం వెళ్లారు.
Also Read : Chiru Anil: నయనతార కోసం తగ్గేదేలే!
Also Read
- Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్... డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త "మైండ్ గేమ్"!
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
- Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చి కొంత రెస్ట్ తీసుకోబోతున్నాడు. ఆ తర్వాత నాని కూడా ఈ షూట్‌లో జాయిన్ కాబోతున్నాడని, 18 నుంచి జరగబోయే షూట్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ముందుగా టాకీ పార్ట్ కొంత షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ చేసిన గ్లింప్స్‌తోనే ఒక్కసారిగా ఈ సినిమా మీద అన్ని వర్గాల్లో చర్చ మొదలైంది. సికిందరాబాద్ ప్యారడైజ్ ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని కథ రాసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది, కానీ దీనికి సంబంధించిన అధికారిక క్లారిటీ ఇంకా లేదు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను సహ-నిర్మాణం చేసేందుకు సరిగమ సంస్థ కూడా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.
- Tags
- 'Paradise'
- Nani
తాజావార్తలు
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!