Nani: న్యాచురల్ స్టార్ నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారు. 15 రోజులు పాటు నాని విపరీతంగా కష్టపడి ఈ ఫైట్ సీక్వెన్స్ చేసినట్టు తెలుస్తోంది. నాని సరికొత్త లుక్ లో ఈ సీక్వెన్స్ చేశాడు. అంతేకాదు ఆ ఫైట్ సీక్వెన్స్ కోసం చాలా ఖర్చుపెట్టినట్లు చెబుతున్నారు. రియల్ సతీష్ మాస్టర్ తో పాటుగా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు కొంతమంది ఈ ఫైట్ కోసం పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ షూట్ జరుగుతున్న సమయంలోనే నాని కొంచెం సిక్ అయ్యాడని, జ్వరంతో అనీజినెస్ తో బాధపడుతూనే ఆ సీక్వెన్స్ చేశాడని తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే నాని ది బెస్ట్ సినిమాకి ముఖ్యంగా ఆ ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. అలాగే ఈ సినిమాకి ప్రాణం పెడుతూ పనిచేస్తున్నాడని ఇన్సైడ్ టాక్. సినిమా టైటిల్ ది ప్యారడైజ్ కానీ నాని మాత్రం ఆ ఫైట్ సీక్వెన్స్ సమయంలో నరకం చూసాడని, అంత అనారోగ్యంతో ఉండి కూడా ఏమాత్రం తగ్గకుండా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఈ ఫైట్ స్క్రీన్ మీద ఎలా పేలుతుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.