Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమ…ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటి..కానీ అదే సమయంలో అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న భావోద్వేగాల్లో కూడా ఒకటి. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. సముద్రాల లోతులను కొలిచాడు. ఆకాశగంగల దూరాలను లెక్కపెట్టాడు. కానీ ప్రేమ అనే భావనను మాత్రం ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే మనం ప్రేమను అనుభవిస్తున్నాం కానీ ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. ఒక మనిషి మన జీవితంలోకి వస్తాడు. మన రోజుల్లో భాగమవుతాడు. మన నవ్వుల్లో కలిసిపోతాడు. మన కలల్లో చోటు సంపాదించుకుంటాడు.
కొంతకాలం తర్వాత ఆ మనిషే మన జీవితమే అయిపోయారని మనకు అనిపిస్తుంది. అక్కడే ఒక చిన్న పొరపాటు మొదలవుతుంది. మన జీవితంలో భాగమైన వ్యక్తిని పూర్తిగా మన జీవితంగా భావించడంతోనే ప్రారంభమవుతుంది. మనతో నడిచే మనిషిని మన సొంతంగా అనుకోవడం, మనల్ని ప్రేమించిన వ్యక్తిపై మనకు హక్కు ఉందని నమ్మడం ఎంత దారుణమైన విషయమో అర్థంకావాలంటే మొహాలిలో జరిగిన విషాదకర ఘటనను అర్థంచేసుకోవాలి.
Also Read
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Kalki 2: వచ్చే నెల నుంచే 'కల్కి 2' నాన్-స్టాప్ షూటింగ్!
- Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
- Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
మొహాలిలో ఏం జరిగింది?
ఆమె పేరు డింపుల్..వయసు 30సంవత్సరాలు.. అతని పేరు హర్జిందర్సింగ్ మాన్.. వయసు 34ఏళ్లు. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల డింపుల్ హర్జిందర్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది.
మరోవైపు డింపుల్ తల్లిదండ్రులు ఆమెకు మరికొన్ని రోజుల్లోనే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే హర్జిందర్ మాత్రం డింపుల్ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. చేతిలో చిన్న కత్తి పట్టుకొని డింపుల్ పనిచేస్తున్న ఆఫీస్‌లోకి చొరబడ్డాడు. కొలిగ్స్ అందరూ ఓవైపు చూస్తున్నా, అతడిని ఆపే ప్రయత్నం చేస్తున్నా హర్జిందర్ ఆగలేదు. డింపుల్‌ను కసితీరా 34సార్లు పొడిచి చంపాడు. సీసీటీవీలో రికార్డయిన ఈ విజువల్స్ చూసి దేశం మొత్తం షాక్ అయ్యింది.
నిజానికి ప్రేమకు హక్కులతో సంబంధం లేదు. ప్రేమ ఒక బంధం కావచ్చు కానీ బంధనం కాకూడదు. ప్రేమ ఒక అనుభూతి కావచ్చు కానీ ఓనర్షిప్ కాకూడదు. ఎందుకంటే మనం ప్రేమించే ప్రతి మనిషి ముందుగా ఒక స్వతంత్ర వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. వారికి వారి ఆలోచనలు ఉంటాయి. వారి కలలు ఉంటాయి… వారి నిర్ణయాలు కూడా ఉంటాయి.
మనతో ఉండే హక్కు ఉన్నట్టే… మనతో ఉండకూడదని నిర్ణయించుకునే హక్కు కూడా ఉంటుంది. ఇదే ప్రేమలో అత్యంత కఠినమైన సత్యం. దీన్ని అంగీకరించడం చాలా కష్టం కానీ ప్రేమలో ఉండాల్సిన మెచ్యురిటీ ఇదే. ఎందుకంటే నిజమైన ప్రేమలో దూరం అవుదాం అనుకున్నవారికి ఆ పని చేయనిచ్చే స్వేచ్ఛ ఉంటుంది. విచిత్రంగా మనుషుల మాత్రం ఈ సత్యాన్ని మరిచిపోతారు. వాళ్లు లేకుండా బతకలేననే భావాన్ని ప్రేమ అనుకోవడంతో మెంటల్ పీస్ దెబ్బతినడం మొదలవుతుంది. వాళ్లపై హక్కు కోరడాన్ని ప్రేమ అనుకోకూడదు.
ప్రేమంటే హక్కుగా భావించడం కాదు:
ప్రేమలో అత్యంత గొప్ప పదం ఐ లవ్ యూ కాదు.. ఐ అండర్‌స్టాండ్ యూ..! అవును..! నేను నిన్ను అర్థం చేసుకున్నాను.. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను..నాతో ఉన్నా లేకపోయినా నీ సంతోషమే అని భావించగలిగే స్థితి ఉండడమే నిజమైన ప్రేమకు అర్థం. ఒకవేళ ఈ సత్యాన్ని మనం చిన్నప్పటి నుంచే నేర్చుకుని ఉంటే… ప్రేమను హక్కుగా కాకుండా బాధ్యతగా చూసి ఉంటే… ఎదుటివారి స్వేచ్ఛను ప్రేమలో భాగంగా అర్థం చేసుకుని ఉంటే… మొహాలీలో జరిగిన ఈ విషాద ఘటన మరో రూపంలో ముగిసేదేమో. ఎందుకంటే ప్రేమికురాలి మాటను అంగీకరించలేని మనస్తత్వమే ఇక్కడ పైచేయి సాధించడంతో పాటు డింపుల్ హత్యకు కారణమైంది.
నిజానికి హృదయం పగలడం కూడా జీవితంలో ఒక పాఠమే. అది మనల్ని బలహీనులను చేయదు. మనల్ని మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. ప్రేమ విఫలమైతే మనిషి విఫలమైనట్టు కాదు. ఒక సంబంధం ముగిసిందంటే జీవితం ముగిసినట్టు కాదు. ఒకరు వెళ్లిపోయారంటే మన భవిష్యత్తు వెళ్లిపోయినట్టు కాదు.
ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రేమకన్నా గొప్పది ఒకటి ఉంది. అది మానవత్వం. ఎంత బాధలో ఉన్నా దాన్ని కోల్పోకపోవడం.. ఎంత కోపం వచ్చినా దాన్ని కాపాడుకోవడం.. ఎంత నిరాశ వచ్చినా ఎదుటి వ్యక్తి కూడా ఒక మనిషేనని గుర్తుంచుకోవడం అన్నిటికంటే ముఖ్యం. నువ్వు నాతో ఉంటే సంతోషమే..ఒకవేళ లేకపోయినా నీకు మంచి జరగాలని కోరుకుంటానని భావించడమే నిజమైన ప్రేమకు చివరి నిర్వచనం కావచ్చు. కానీ అది లేకపోగా.. ప్రేమించినవాళ్లు మన ఆస్తి అన్నట్టు.. మన హక్కు అన్నట్టు.. మన సొంతమన్నట్టు ఈ సమాజం ఉన్నంతకాలం మొహాలీ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి.
తాజావార్తలు
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!