Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని పిండేసి అందరికీ గుర్తుండి పోయిన ముమైత్ ఖాన్ ఎన్టీవీ (NTV) తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ తన జీవితంలోని హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, వాటిని ఎలా అధిగమించారనే విషయాలపై చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు ఎదురైన కష్టాల గురించి, తాను డిప్రెషన్ లోకి వెళ్ళడం గురించి ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. “నాకు గతంలో బ్రెయిన్ నర్వ్ బరస్ట్ అయింది. దాంతో నా తలలో తొమ్మిది టైటానియం వైర్లను అమర్చాల్సి వచ్చింది. ఆ సర్జరీ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉండేవి. తరచూ సీజర్ ఎటాక్స్ (ఫిట్స్ లాంటివి), తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి వచ్చేవి. ఈ హెల్త్ కండిషన్ వల్ల, వాడుతున్న హెవీ మెడికేషన్ (మందుల) వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్లాల్సి వచ్చింది.
నేను కావాలని డిప్రెషన్లోకి వెళ్లలేదు, ఆ మందుల ప్రభావం నన్ను అలా మార్చేసింది” అని చెప్పుకొచ్చారు. ఆ క్లిష్ట సమయంలో తాను తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ.. “ఒకానొక దశలో ఏం చేయాలో పాలుపోక తీవ్ర మానసిక వేదన అనుభవించాను. అప్పుడు నా మైండ్‌ను నేనే కంట్రోల్ చేసుకున్నాను. నాకున్న డిప్రెషన్‌ను, నేను లైఫ్‌లో సాధించిన సక్సెస్ మరియు అచీవ్మెంట్స్ తో పోల్చి చూసుకున్నాను. నా సక్సెస్ ముందు ఈ డిప్రెషన్ చాలా చిన్నదిగా అనిపించింది. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే అని నాకు అర్థమైంది” అన్నారు. లైఫ్ అంటేనే హెార్ట్ బీట్ లాంటిదని.. గ్రాఫ్ ఎప్పుడూ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉండాలని, అప్పుడే మనం బ్రతికి ఉన్నట్లు లెక్క అని ఆయన ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు. ఎప్పుడూ లైఫ్ ‘అప్’ లోనే ఉంటే మనం కొత్తగా నేర్చుకునేది ఏముంటుంది? కిందపడితేనే జీవితం విలువ తెలుస్తుంది, బాధను అనుభవిస్తేనే మరింత బలంగా బయటకు రాగలమని ముమైత్ ఖాన్ వివరించారు.
Also Read
“నాకు సక్సెస్ ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్ చెబుతాను, అలాగే డిప్రెషన్, ఆ బ్రెయిన్ సర్జరీ బ్రేక్ ఇచ్చినందుకు కూడా థాంక్స్ చెబుతాను. ఎందుకంటే ఆ చేదు అనుభవాల వల్లే ఈరోజు నేను ఇంత పెద్ద సెమినార్ చేయగలిగాను. నా దృష్టిలో మంచి, చెడు, అత్యంత దారుణమైన పరిస్థితులు.. అన్నీ భగవంతుడి ఆశీర్వాదాలే! ఏది జరిగినా నేను ఆగిపోను.. ముందుకు సాగిపోతూనే ఉంటాను” అని ఎమోషనల్ అయ్యారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు