Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Kim Jong Un Killed Uncle Jang Song Thaek Now Grooming Daughter Ju Ae As Successor

Kim: న*గ్నంగా ఊరేగించాడు.. సొంత మామనే కుక్కలతో కరిపించి చంపాడు.. కిమ్‌ కిరాతకం!

Published Date :February 19, 2026 , 4:00 pm
By Trinath Bandaru
Kim: న*గ్నంగా ఊరేగించాడు.. సొంత మామనే కుక్కలతో కరిపించి చంపాడు.. కిమ్‌ కిరాతకం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తన అధికారాన్ని కాపాడుకోవడానికి సొంత మామనే నిర్దాక్షిణ్యంగా తొలగించిన నాయకుడి కథ మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. మావయ్యను చంపడం కోసం అతడిని కుక్కలకు ఏరగా పడేశాడనే గుసగుసలు నాడు ప్రపంచాన్ని వణికించాయి. ఆ కథ నిజమా కాదా అన్నది పక్కన పెడితే.. ఆ కుటుంబంలో రక్త బంధాలు కంటే అధికారమే పెద్దదని అప్పుడే స్పష్టంగా తెలిసివచ్చింది. ఇప్పుడు అదే ఉత్తర కొరియా రాజవంశంలో మరో సంచలన దశ మొదలైంది.

కిమ్ జోంగ్ ఉన్ తన టీనేజ్ కుమార్తెను వారసురాలిగా సిద్ధం చేస్తున్నాడనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. అధికార బదిలీ అనే మాట అక్కడ సాధారణ రాజకీయ ప్రక్రియ కాదు.. అది చరిత్రలో ఎప్పుడూ తుపాకీ శబ్దాల మధ్యే జరిగిందనే భయం ప్రపంచాన్ని మళ్లీ కమ్మేస్తోంది. ఇంతకీ గతంలో ఏం జరిగింది? కిమ్‌ తన మావయ్యను ఎందుకు చంపాడు?

అది 2013.. కిమ్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. దేశంలో అతనికి తోడునీడలా ఉన్న వ్యక్తి జాంగ్ సాంగ్ థేక్. కిమ్ తండ్రి జోంగ్ ఇల్ కాలంలోనే కీలక నేతగా ఎదిగిన ఆయనను అప్పటివరకు ఉత్తర కొరియాలో రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చెప్పుకునేవారు.

Also Read

  • Gayapadda Simham Exclusive: హ్యాపెనింగ్ హీరో ఎక్స్టెండెడ్ క్యామియో.. మరో సర్ప్రైజ్ కూడా!
  • Titanic-The Untold Story: చరిత్ర మరిచిన త్యాగం..! ఆమె మరణించింది..వాళ్లు బతికారు..! ఆ రోజు ఏం జరిగింది?
  • Tamanna Simhadri: తల్లి కాబోతున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి: అసలు కుదురుతుందా?
  • 1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్‌ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!

అధికార మార్పిడి సమయంలో యువ కిమ్‌కు రాజకీయ అండగా నిలిచిన వ్యక్తి కూడా ఆయనే. అలాంటి వ్యక్తిని 2013 డిసెంబర్‌లో ఒక్కసారిగా పార్టీ సమావేశం నుంచి సైనికులు లాక్కెళ్లిన దృశ్యాలు దేశ మీడియా ప్రసారం చేసింది. కొద్ది రోజుల్లోనే అతనిపై దేశద్రోహం, అధికారం కబళించే కుట్ర, అవినీతి, డ్రగ్స్ వినియోగం లాంటి ఆరోపణలు మోపింది. ఆ వెంటనే అతన్ని న్యాయస్థానం విచారించడమే కాకుండా మరణదండన కూడా అమలు చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. రాష్ట్ర వార్తా సంస్థ అతన్ని దేశానికి శాశ్వత ద్రోహిగా అభివర్ణించింది. అతన్ని నగ్నంగా ఉంచి కుక్కలకు ఆహారంగా వేశారన్న కథ ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొట్టింది. అయితే ఆ కథను స్వతంత్రంగా ఎవరూ ధృవీకరించలేకపోయారు. కానీ అతన్ని కాల్చివేశారన్న విషయాన్ని మాత్రం అంతర్జాతీయ వర్గాలు విశ్వసించాయి. ఇక కిమ్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరాల్లోనే పలువురు ఉన్నతాధికారులను పదవి నుంచి తొలగించారు. 2011 నుంచి 2016 మధ్య వందల సంఖ్యలో అధికార మార్పులు, అరెస్టులు, శిక్షలు నమోదయ్యాయి. అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు, అంతర్జాతీయ ఆంక్షలు మధ్య అతను కఠిన నాయకత్వాన్ని ప్రదర్శించాడు. కొందరు విశ్లేషకులు దీన్ని భయపెట్టే పాలనగా చెప్పారు.

ఇక ఇదే సమయంలో పరిస్థితి మరో మలుపు తిరుగుతోంది. దక్షిణ కొరియా గూఢచారి సంస్థ సమాచారం ప్రకారం కిమ్ తన కుమార్తెను ముఖ్య కార్యక్రమాలకు తీసుకువస్తున్నాడు. ఆమె పేరు జూ-ఏ. ఇటు క్షిపణి పరీక్షల సందర్బంగా ఆమెను ప్రజలకు చూపించారట.

ఇక అధికార వర్గాల్లో ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇది వారసత్వ రాజకీయాల సంకేతంగా పరిగణిస్తున్నారు. అయితే అదే సమయంలో కిమ్ సోదరి యో జోంగ్ కూడా కీలక నేతగా కొనసాగుతోంది. విదేశాంగ ప్రకటనలు, రాజకీయ వ్యాఖ్యల్లో ఆమె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ కుమార్తెను అధికార వారసురాలిగా ప్రకటిస్తే కుటుంబంలో అంతర్గత శక్తి సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఉత్తర కొరియాలో అధికార మార్పిడి ఎప్పుడూ సాఫీగా జరగలేదనే చరిత్ర దృష్ట్యా ఈ పరిణామాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి.

నిజానికి ఉత్తర కొరియా ఒకే కుటుంబ పాలనలో ఉన్న రాష్ట్రం. 1948 నుంచి ఇప్పటివరకు కిమ్ వంశమే అధికారంలో ఉంది. కిమ్ ఇల్ సంగ్ నుంచి కిమ్ జోంగ్ ఉన్ వరకు మూడు తరాలుగా అధికారం బదిలీ అవుతూ వచ్చింది. అయితే ప్రతీసారి ఏదో ఒక సంచలన ఘటన జరిగింది. అందుకే ఉత్తర కొరియాలో అధికార కుర్చీ కేవలం పాలనా స్థానమే కాదు.. అది రక్తంతో రాసుకున్న చరిత్రకు సాక్ష్యం. ఇప్పుడు ఆ చరిత్ర మరో అధ్యాయానికి చేరువలో ఉందన్న సంకేతాలు ప్రపంచాన్ని మళ్లీ కలవరపెడుతున్నాయి.
ALSO READ: ‘ఇన్‌స్టా రీల్‌ కోసం నా బిడ్డ ప్రాణాన్ని తీశారు..’ సహిల్ తల్లి కన్నీటి కథ!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jang Song-thaek
  • Kim Jong Un
  • Kim Ju-ae.
  • North Korea
  • North Korea succession

తాజావార్తలు

  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!

  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు

  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..

  • World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions