Karnataka Power Tussle: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. రెండేళ్లుగా సాగుతున్న సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ కుర్చీలాటకు కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యూహాత్మక ముగింపు పలికింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేబినెట్‌కు ఇన్ఫామ్ చేశారు. అయితే ఈ మార్పు ద్వారా సిద్ధరామయ్యను నొప్పించకుండా జాతీయ స్థాయి బాధ్యతను అప్పగించే వ్యూహంతో హైకమాండ్ పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇంతకీ సిద్ధరామయ్యను పదవి నుంచి దిగిపోయేలా ఎలా ఒప్పించారు? కర్ణాటకను అడ్డంపెట్టుకుని 2029 లోక్‌సభ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి?
టగ్ ఆఫ్ వార్‌లో విజేత డీకే:
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య… డీకే శివకుమార్ మధ్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎంతో కృషి చేసిన డీకే శివకుమార్ మొదటి నుంచి సీఎం సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ హైకమాండ్ ముందు సిద్ధరామయ్య లాబీయింగ్ పనిచేయడంతో డీకే సీఎం కాలేకపోయారు. అప్పటి నుంచి డీకే-సిద్ధరామయ్య మధ్య వ్యవహారం ఎడమొహం పెడమొహం అన్నట్టే సాగుతోంది. ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో తనకు పగ్గాలు అప్పగించాల్సిందేనని డీకే భీష్మించుకున్నారు.
Also Read
ఎప్పటి నుంచో నాన్చుతూ వస్తోన్న కాంగ్రెస్ హైకమాండ్… ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఢిల్లీ వేదికగా సుదీర్ఘ కసరత్తు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. రాహుల్ గాంధీ సమక్షంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలాలతో దాదాపు 7 గంటల పాటు అత్యంత రహస్యంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సిద్ధరామయ్యను గౌరవప్రదంగా దిల్లీ రాజకీయాల్లోకి తీసుకురావడమే ఏకైక ఎజెండాగా చర్చ సాగింది.
ఒక సీనియర్ మాస్ లీడర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం అంటే పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను నొప్పించకుండా ఆయనను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఒక భారీ వ్యూహాన్ని రచించింది. కేవలం పదవి నుంచి తప్పించడం కాకుండా ఆయనకు జాతీయ స్థాయిలో మరింత పెద్ద పీట వేయబోతోంది. ఇందులో భాగంగానే సిద్ధరామయ్యను రాజ్యసభ మార్గం ద్వారా ఢిల్లీకి పిలిపించి ఏఐసీసీలో అత్యంత కీలకమైన సంస్థాగత బాధ్యతలను అప్పగించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. జూన్ 8తో కర్ణాటక నుంచి రాజ్యసభ నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో ఇదే సరైన సమయమని హైకమాండ్ భావించి సిద్ధరామయ్యను ఒప్పించే ప్రయత్నం చేసింది.
సోషల్ జస్టిస్ వ్యూహమంటే ఏంటి?
ఈ మొత్తం వ్యవహారం వెనుక రాహుల్ గాంధీ సోషల్ జస్టిస్ వ్యూహం దాగి ఉందని ఢిల్లీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కుల గణన, ఓబీసీ హక్కుల అజెండాతో ముందుకు వెళ్తోంది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా బలమైన ఓబీసీ ఓటు బ్యాంకును ఆకర్షించాలంటే సిద్ధరామయ్య లాంటి ఒక తిరుగులేని ఓబీసీ మాస్ లీడర్ జాతీయ స్థాయిలో అవసరమని అధిష్టానం ఆయనకు వివరించింది. 2029 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓబీసీలను కాంగ్రెస్ వైపు తిప్పేందుకు సిద్ధరామయ్యను ఒక జాతీయ ముఖచిత్రంగా వాడుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఢిల్లీకి వస్తే ఆయన రాజకీయ ప్రాధాన్యత తగ్గబోదని.. పైగా దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని నచ్చజెప్పారు.
సిద్ధరామయ్య ఢిల్లీలో ఏం చేస్తారు?
సిద్ధరామయ్య ఢిల్లీకి మారితే… కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం డీకే శివకుమార్ మాత్రమే. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే.. రెండున్నరేళ్లు సిద్ధరామయ్య.. ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారనే అంతర్గత అధికార మార్పిడి ఒప్పందం జరిగిందని డీకే వర్గం మొదటి నుంచి చెబుతోంది. ఇప్పుడు సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుండటంతో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు కర్ణాటక పగ్గాలు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ మార్పు వల్ల సిద్ధరామయ్య వర్గం అలగకుండా, పార్టీలో అంతర్గత విబేధాలు రచ్చకెక్కకుండా చూసేందుకు అధిష్టానం ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!