Site icon NTV Telugu

Coolie Exclusive: ఆ ఒక్క మాట బయటకొస్తే చాలు.. అరాచకమే!

Coolie

Coolie

లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు లోకేష్ కనగరాజు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా “కూలీ” అనే సినిమా రూపొందుతోంది. లోకేష్ “విక్రమ్” చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో పాటు, ఈ సినిమాలో విలన్‌గా నాగార్జున నటిస్తూ ఉండడంతో సినిమా మీద అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఆసక్తిని మరింత పెంచేలా రోలెక్స్ అనే పాత్రలో ఈసారి అమీర్ ఖాన్‌ను రంగంలోకి దించడంతో పాటు, కన్నడ నుంచి ఉపేంద్రను కూడా సినిమాలో భాగం చేశారు. పూజా హెగ్డే, శృతి హాసన్, సత్యరాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా గురించి ఇన్‌సైడ్ టాక్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.

Also Read:Rashmika : డబ్బులు ఇచ్చి ట్రోలింగ్ చేయిస్తున్నారు.. నిజాలు బయటపెట్టిన రష్మిక మందన్న !

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయంలోనే టీం కొంచెం ఆలోచనలో ఉందని అంటున్నారు. సినిమా సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయిందని, ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే పీక్స్‌లో ఉంటుందని అంచనా. చివరి 20 నిమిషాలలో అమీర్ ఖాన్ ఎంట్రీ ఉంటుందని, అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్ అని అంటున్నారు. ముఖ్యంగా అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో వర్క్ అవుట్ అయిందని అంటున్నారు.

Also Read:Vallabhaneni Anil: రేపు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ఛాంబర్ చర్చలు?

అయితే, ఫస్ట్ హాఫ్ విషయంలోనే టీం కొంచెం అనుమానంగా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో కూడా జస్ట్ ఓకే అనే మాట వచ్చినా సరే, సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, బ్లాక్‌బస్టర్ హిట్ అవడం ఖాయం అని టీం భావిస్తోంది. అనుమానాలు ఉన్నాయి కాబట్టి, దాని మీద ఇంకేమైనా వర్క్ చేయొచ్చా అనే ఆలోచన కూడా జరుగుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని సినిమా యూనిట్ అంచనా వేస్తోంది. అయితే, ఫస్ట్ హాఫ్ విషయంలో టీం అంచనాలు ఏమవుతాయో చూడాలి.

Exit mobile version