టాలీవుడ్‌లో గత ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కంటెంట్ ఉన్నా, లేకపోయినా స్టార్స్ ఉంటే సినిమాలు మినిమం గ్యారంటీ అనిపించుకునేవి. మంచి కలెక్షన్స్ వచ్చేవి, నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. కానీ పరిస్థితులు మారిపోయిన తర్వాత స్టార్ పవర్ కన్నా కంటెంట్ పవర్ ఎక్కువ అని ప్రూవ్ అవుతోంది. గత ఏడాది గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ఆ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు నటిస్తే, దాన్ని పక్కనపెట్టి తేజ సజ్జా నటించిన హనుమాన్‌ను ప్రేక్షకులు ఆదరించారు. సంక్రాంతికి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్, వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చాయి. ఇక్కడ బడ్జెట్ పరంగా, స్టార్ ఇమేజ్ పరంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పెద్దది. కానీ దాంతో పాటు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ప్రేక్షకులు పట్టం కట్టారు, కానీ రామ్ చరణ్ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు.
Also Read:Delhi Government: ఆ 70 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ 16 ప్రోలు గిఫ్ట్ ఇచ్చిన సర్కార్..!
దీంతో సంక్రాంతికి వస్తున్నాం భారీగా ఆడింది. ఇక ఇప్పుడు కొద్ది రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమాతో పాటు మహావతార్ నరసింహ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. హరిహర వీరమల్లు ఓపెనింగ్స్ పర్వాలేదనిపించుకున్న తర్వాత కలెక్షన్స్ విషయంలో బోల్తా పడింది. మహావతార్ నరసింహ సినిమాకి మాత్రం సినిమా రిలీజ్‌కి ముందు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కేవలం ప్రింట్ అండ్ వెబ్ మీడియా వాళ్లతోనే ఇంటరాక్ట్ అయ్యారు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఆ కంటెంట్ బాగుండడంతో ప్రేక్షకులు పబ్లిసిటీ లేకపోయినా ఆ సినిమాకి వెళ్తూ, ఈ రోజుకీ టికెట్లు దొరకని స్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ స్టార్ ఇమేజ్ కాదు, కావాల్సింది కంటెంట్. కంటెంట్ అంటే అదేదో అద్భుతం అని అనుకోరు. కేవలం ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చి ఏదో ఒక రకంగా ఎంజాయ్ చేయగలిగితే చాలు, అదే ది బెస్ట్ కంటెంట్ అన్నమాట.