AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ పెరుగుతోంది… అదే సమయంలో సైబర్ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓవైపు ప్రపంచాన్ని శాసిస్తుందని భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మారుస్తుందనుకుంటున్న క్రిప్టోకరెన్సీ… ఇప్పుడు ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఏఐ సాంకేతికతను ఆసరాగా చేసుకొని, హ్యాకర్లు క్రిప్టో రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. లక్షల కోట్లు దోచేస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు భారీ దాడులు.. క్రిప్టో ప్రపంచాన్ని వణికించాయి. అసలు ఏఐ సాయంతో హ్యాకర్లు ఏం చేస్తున్నారు? 130 బిలియన్ డాలర్ల అతిపెద్ద డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ రంగం ఎందుకు ప్రమాదంలో పడింది?
రూ.5వేల కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు:
క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. అయితే ఇప్పుడు మార్కెట్ హెచ్చుతగ్గుల కంటే.. హ్యాకర్ల దాడులే ఇన్వెస్టర్లను ఎక్కువ భయపెడుతున్నాయి. ఏప్రిల్ నెలలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే హ్యాకర్లు రెచ్చిపోయారు. ఏకంగా 600 మిలియన్ డాలర్లు… అంటే మన కరెన్సీలో సుమారు 5 వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ చరిత్రలోనే ఇవి రికార్డు స్థాయి దాడులు. ఈ దాడుల దెబ్బకు ఒక ప్రధాన ప్లాట్‌ఫారమ్ నుంచి ఇన్వెస్టర్లు భయంతో తమ పెట్టుబడులను ఉపసంహరించుకోగా… మరో ప్లాట్‌ఫారమ్ ఏకంగా మూతపడే పరిస్థితికి చేరుకుంది. హ్యాకింగ్ జరిగిన ప్లాట్‌ఫారమ్ నుంచి లాండరింగ్ చేయడానికి ప్రయత్నించడంతో.. ఇన్వెస్టర్లు భయంతో కేవలం రెండు రోజుల్లోనే.. సుమారు 9 బిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 75 వేల కోట్ల రూపాయల నిధులను.. వెనక్కి తీసుకున్నారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read
బ్లాక్‌చైన్ నెట్‌వర్క్‌లో లొసుగులు:
ఈ దాడులు ఎంత నష్టం చేశాయన్నది ఒక ఎత్తైతే… హ్యాకర్లు దొంగతనానికి వాడిన విధానం.. సైబర్ సెక్యూరిటీ నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. TRM ల్యాబ్స్ బ్లాక్‌చైన్ ఫోరెన్సిక్స్ సంస్థ రిపోర్ట్ ప్రకారం… ఈ దాడుల వెనుక ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్ల గ్రూపుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే వారు సాధారణ పద్ధతుల్లో కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ వాడి.. టార్గెట్లను ఎంచుకున్నారు. బ్లాక్‌చైన్ నెట్‌వర్క్‌లోని లొసుగులను కనుక్కోవడానికి, దాడులను డిజైన్ చేయడానికి.. ఏఐను వాడారు. ఒకప్పుడు సిస్టమ్‌లోని కోడ్స్‌ను డీకోడ్ చేయడానికి నెలల సమయం పట్టేది.. కానీ ఇప్పుడు ఏఐ వాడకం వల్ల అది కొన్ని రోజులు లేదా గంటల్లోనే పూర్తవుతోంది. దీంతో భద్రతాపరంగా చిన్న తప్పు జరిగినా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
తలపట్టుకుంటున్న దర్యాప్తు సంస్థలు:
డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అనేది సుమారు 130 బిలియన్ డాలర్ల అతిపెద్ద రంగం. ఇక్కడ ఆటోమేటెడ్ ప్రోటోకాల్స్ ద్వారా ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీని ట్రేడింగ్ చేయడం,. అప్పుగా ఇవ్వడం చేస్తుంటారు. కాబట్టి ఇది చాలా సున్నితమైన వ్యవస్థ. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థతో పోలిస్తే ఇక్కడ నిఘా పర్యవేక్షణ దాదాపు శూన్యం. బ్యాంకుల్లో అయితే అనుమానాస్పద లావాదేవీలను వెంటనే బ్లాక్ చేసి నిలిపివేసే అవకాశం ఉంటుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో ఒక్కసారి లావాదేవీ జరిగితే దాన్ని రివర్స్ చేయడం అసాధ్యం. డీఫై నెట్వర్క్ అంతా స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనే సెల్ఫ్-ఎగ్జిక్యూటింగ్ కోడ్స్‌పై నడుస్తుంది. హ్యాకర్లు ఏఐ సాయంతో.. ఈ కోడ్స్‌లో ఉన్న చిన్నచిన్న ప్యాచ్ వర్క్ లోపాలను ఈజీగా పసిగడుతున్నారు. దొంగిలించిన నిధులను ఎవరికీ చిక్కకుండా.. వివిధ మార్గాల్లో తరలించేస్తూ దర్యాప్తు సంస్థలకు సైతం సవాల్ విసురుతున్నారు.
క్రిప్టో కూలిపోతుందా?
భవిష్యత్తులో ఈ ముప్పు మరింత పెరగనుందనడానికి టెక్ కంపెనీల భయాలే నిదర్శనం. ఆంత్రోపిక్ ఏఐ రీసెర్చ్ సంస్థ.. సైబర్ సెక్యూరిటీ ముప్పు కారణంగా.. తమ సరికొత్త మైథోస్ అనే ఏఐ మోడల్ విడుదలను ఆపివేసింది. భవిష్యత్తులో నేరస్తుల చేతికి మరింత శక్తివంతమైన ఏఐ టూల్స్ చిక్కితే.. పరిస్థితి అదుపు తప్పుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మున్ముందు ఈ దాడుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డీఫై ప్రాజెక్ట్‌లు అన్నీ తమ భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకోవడానికి పరుగులు తీస్తున్నాయి. లేకపోతే ఏఐ దాడులకు ఈ 130 బిలియన్ డాలర్ల క్రిప్టో మార్కెట్ కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.
:- ఫణి కుమార్ (NTV DIGITAL)
తాజావార్తలు
-
Indian Navy SSC Officer Recruitment 2026: భారత నావికాదళంలో 275 SSC ఆఫీసర్ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివరాలు
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Dhanush : ధనుష్ ‘DxV’ క్రేజీ పోస్టర్.. అసలు ఆ డైరెక్టర్ ఎవరు?
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు సిట్..
-
Mysa: నీటి అడుగున రష్మిక రిస్క్.. ‘మైసా’ నుంచి క్రేజీ అప్డేట్
ట్రెండింగ్
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!