ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) మాతృ సంస్థ అయిన ఎటెర్నల్ (Eternal) కీలక నిర్ణయాలు తీసుకుంది. కంపెనీ మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను ప్రకటించడంతో పాటు, యాజమాన్య నిర్మాణంలో పెను మార్పులను చేపట్టింది. సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ సీఈఓ పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎటెర్నల్ గ్రూప్ సీఈఓగా ఉన్న దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదు. భవిష్యత్తులో కంపెనీకి సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉంటూ, బోర్డు డైరెక్టర్‌గా , వైస్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. కొన్ని కొత్త , అధిక రిస్క్ కలిగిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీపిందర్ గోయల్ స్థానంలో బ్లింకిట్ (Blinkit) సీఈఓ అల్బీందర్ సింగ్ దిండ్సా ఎటెర్నల్ గ్రూప్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బ్లింకిట్‌ను క్విక్ కామర్స్ రంగంలో తిరుగులేని శక్తిగా మార్చడంలో అల్బీందర్ చూపిన ప్రతిభను గుర్తించి ఈ పదవిని కట్టబెట్టారు. ఫిబ్రవరి 1, 2026 నుండి ఆయన ఈ కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు.
Kerala Woman: కేరళ బస్ వైరల్ వీడియో.. నిందితురాలు షింజితా ముస్తాఫా అరెస్ట్..
యాజమాన్య మార్పుల వేళ కంపెనీ అద్భుతమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. 2025 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ₹102 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఉన్న ₹59 కోట్లతో పోలిస్తే ఇది 73 శాతం పెరుగుదల. ఆదాయం పరంగా ఎటెర్నల్ రికార్డు సృష్టించింది. గత ఏడాది ₹5,405 కోట్లుగా ఉన్న ఆదాయం, ఏకంగా 202 శాతం వృద్ధి చెంది ₹16,315 కోట్లకు చేరుకుంది.
ఈ ఫలితాల్లో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ‘బ్లింకిట్’ కీలక పాత్ర పోషించింది. బ్లింకిట్ తన నిర్వహణలో బ్రేక్ ఈవెన్ (Break-even) సాధించి లాభాల బాట పట్టడం కంపెనీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. అల్బీందర్ సింగ్ దిండ్సా నాయకత్వంలో బ్లింకిట్ సాధించిన ఈ విజయమే ఆయనను గ్రూప్ సీఈఓ స్థాయికి చేర్చిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ మార్పుల నేపథ్యంలో ఎటెర్నల్ షేర్లు మార్కెట్లో ఎలా స్పందిస్తాయోనని ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Palli Chattambi: తెలుగులోకి టోవినో థామస్ సినిమా.. అసలేంటీ పళ్లి చట్టంబి?