Site icon NTV Telugu

Zelenskiy: రష్యాతో శాంతి ఒప్పందానికి అమెరికా ఒత్తిడి.. జెలెన్‌స్కీ కొత్త ప్లాన్ ఇదే!

Zelenskiy

Zelenskiy

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమెరికా 28 పాయింట్ల ప్రణాళికను రూపొందించారు. దీనిపై ఇప్పటికే ట్రంప్ బృందం ఇరు దేశాలతో చర్చించాయి. 28 పాయింట్ల ప్రణాళికకు రష్యా అంగీకారం తెలిపింది. ఉక్రెయిన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. రష్యా రూపొందించిన ప్రణాళికను అంగీకరించబోమని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో డాన్‌బాస్‌ను వదులుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. తాజాగా 20 పాయింట్ల శాంతి ప్రణాళికను బుధవారం అమెరికాకు అందించినట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

అయితే తాజాగా శాంతి ఒప్పందానికి అంగీకారం తెల్పాలంటూ ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. క్రిస్మస్‌లోపు శాంతి ఒప్పందం జరగాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతి ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా వచ్చే రిజల్ట్స్‌ను బట్టి ముందుకు సాగాలని భావిస్తున్నారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించేందుకు ఏ మాత్రం ఉక్రెయిన్‌కు ఇష్టం లేదు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నడుస్తోంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టినా ఉక్రెయిన్ భూభాగాలు స్వాధీనం చేసుకోవడంలో విఫలమైంది. డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను కలిగిన తూర్పు డాన్‌బాస్‌ను రష్యా స్వాధీనం చేసుకోవాలని రష్యా భావించింది. ఉక్రెయిన్ దళాలు వదిలిపోవాలని రష్యా పట్టుబట్టింది. కానీ సాధ్యం కాలేదు. ప్రస్తుతం డాన్‌బాస్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తు్న్నామని.. ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని జెలెన్‌స్కీ కోరారు.

ఇదిలా ఉంటే యుద్ధం సాకుగా చూపించి జెలెన్‌స్కీ ఎన్నికలు నిర్వహించడం లేదని ట్రంప్ చేసిన ఆరోపణలపై కూడా స్పందించారు. తమ భద్రతకు మిత్ర దేశాలు హామీ ఇస్తే.. 90 రోజులలోపే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని జెలెన్‌స్కీ అన్నారు. రష్యా దాడులు చేస్తుండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సైనికులు ఎలా ఓటు వేస్తారు? ప్రజలు ఎలా ఎన్నికల్లో పాల్గొంటారని అడిగారు.

Exit mobile version