NTV Telugu Site icon

Volodymyr Zelenskyy : బ్రిటన్ ప్రధానిని కలిసి జెలెన్ స్కీ

Jelenski

Jelenski

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ ఇవాళ ( సోమవారం ) యూకేలో కనపడి సర్‌ప్రైజ్ ఇచ్చారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తో ఆయన సమావేశమయ్యారు. ఆదివారం జర్మనీకి వెళ్లిన జెలెన్ స్కీ.. బెర్లిన్‌లో జర్మనీ ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ తో పాటు ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో సమావేశం అయ్యాడు. రష్యాపై పోరుకు ఉక్రెయిన్ కు జర్మనీ భారీగా సహాయం చేసింది. బెర్లిన్ నుంచి జెలెన్ స్కీ నేరుగా బ్రిటన్ కు బయలుదేరాడు. ముందస్తు సమాచారం తెలపకుండా ఆయన బ్రిటన్ కంట్రీలో పర్యటిస్తుండడం గమనార్హం. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఇంతకు ముందు కూడా పలు దేశాల్లో ఇలాగే అకస్మాత్తుగా పర్యటించారు.

Also Read : DK Siva Kumar : కాంగ్రెస్ హైకమాండ్ కు డీకే శివ కుమార్ గట్టి సంకేతాలు

ఉక్రెయిన్ కు తాము దీర్ఘ శ్రేణి క్షిపణులు పంపుతామని బ్రిటన్ ఇటీవలే ప్రకటించింది. ఇంకా ఏం చేయాలన్న విషయంపై జెలెన్ స్కీతో చర్చించానని రిషి సునక్ ఇవాళ వెల్లడించారు. తమకు సాయం చేస్తున్నందుకు ఉక్రెయిన్ ప్రజల తరఫున, సైనికుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా ఎన్ని దాడులు చేస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోతోంది. రష్యా దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతోంది. విదేశాల సాయంతో రష్యాపై ఉక్రెయిన్ పోరాటం కొనసాగిస్తునే ఉంది.

Also Read : Ex-Girlfriend Intimate Photos: మాజీ గర్ల్‌ఫ్రెండ్ నగ్న ఫోటోల్ని వైరల్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు

ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి సంబంధించి ఇది కీలక సమయమని జెలెన్ స్కీ చెప్పారు. ఇప్పుడు యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ భూభాగం లోపల ఉందని.. కానీ దీని ప్రభావం మాత్రం ప్రపంచమంతా ఉందని ఆయన అన్నారు. పుతిన్ కు ప్రతిఫలం దక్కకుండా చేయడమే తన లక్ష్యమని ఉక్రేయిన్ అధ్యక్షుడు అన్నాడు. ఉక్రెయిన్ కు బ్రిటన్ నుంచి సైన్యం, వాయుసేన సామర్థ్యాలను పెంచుకునే విషయంలో కీలక పాత్ర వహిస్తామని చెప్పారు.