Zelensky: అమెరికా వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. నియంత పాలకులతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు తెలుసు అన్నట్టుగా జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు, పరోక్షంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరోపియన్ జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.