Zee Awards : రెండు దశాబ్దాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న జీ తెలుగు ఛానల్, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా తమ ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ ఏడాది ‘వసుధైవ కుటుంబం’ నేపథ్యంతో మరింత వైభవంగా జరగనున్న ఈ వేడుక, జీ తెలుగు ఉన్నతికి కృషి చేస్తున్న నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలను సత్కరిస్తుంది. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2025 పార్ట్-1 లో భాగంగా, బుల్లితెర తారలు, వెండితెర ప్రముఖుల సందడితో కూడిన రెడ్ కార్పెట్ కార్యక్రమం అక్టోబర్ 10, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానుంది. ఇక, ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మొదటి భాగం అక్టోబర్ 11, శనివారం సాయంత్రం 5 గంటలకు జీ తెలుగులో ప్రసారం అవుతుంది. జీ తెలుగు ఇరవై సంవత్సరాల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుక ఆసక్తికరంగా సాగనుంది.
READ ALSO: HIV Patient: ఎవడండీ బాబు వీడు.. మరీ ఇంత తేడాగా ఉన్నాడు.. ఆస్పత్రిలో అందరిపై హెచ్ఐవీ రక్తం
అక్టోబర్ 10న ప్రసారం కానున్న రెడ్ కార్పెట్ కార్యక్రమంలో అందంగా ముస్తాబైన టాలీవుడ్ తారలు, ప్రముఖులు, బుల్లితెర నటీనటులు, ప్రత్యేక అతిథులు సందడి చేయనున్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న అవార్డ్స్ కార్యక్రమం మొదటి భాగానికి ఎనర్జిటిక్ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు – శ్రీముఖి యాంకర్లుగా వ్యవహరించనున్నారు. ప్రదీప్ కామెడీ పంచ్‌లు, శ్రీముఖి ఆకట్టుకునే మాటలతో ఈ కార్యక్రమం ఆహ్లాదభరితంగా సాగనుంది. జీ తెలుగు నటీనటులు తమ సీరియల్ కుటుంబాలతో కలిసి వేదికపైకి రావడంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రదీప్, శ్రీముఖి వారిని పరిచయం చేస్తూ, వారు నటిస్తున్న సీరియల్స్ కథల నేపథ్యాన్ని వివరిస్తూ ప్రేక్షకులను అలరిస్తారు.
READ ALSO: Ratan Tata Dreams: రతన్ టాటా నెరవేరని కలల గురించి తెలుసా!