Satyadev : సత్యదేవ్ హీరోగా కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ కీలక పాత్రలో వచ్చిన ఇటీవల థియేటర్లలో రిలీజైన చిత్రం ‘జీబ్రా’. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో తమిళ నటి ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా హాస్య నాటుడు సత్య ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు రాబట్టింది. రెగ్యులర్ డేస్ లోను స్టడీ కెలెక్షన్స్ రాబడుతూ జీబ్రా సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అయింది.
Read Also:High Alert: పీఎల్‌జీఏ వారోత్సవాలు.. భద్రతా బలగాలు అలర్ట్..
రీసెంట్ గా మన టాలీవుడ్ అందించిన మంచి హిట్ చిత్రాల్లో సత్యదేవ్ నటించిన సాలిడ్ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “జీబ్రా” కూడా ఒకటి. ఈ సినిమా ఇపుడు ఫైనల్ రన్ కి చేరుకుంది. మరి దీనిపై సత్యదేవ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. మా జీబ్రా రన్ కి ఎండ్ కార్డ్ పడింది. థియేటర్లలో ఇంతపెద్ద సక్సెస్ ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మళ్లీ ఖచ్చితంగా స్ట్రాంగ్ సినిమాతో వస్తాను అంటూ ప్రామిస్ చేసాడు. మరి లేటెస్ట్ గా పుష్ప 2 రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అండ్ బుకింగులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. సో జీబ్రా రన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంది. మొత్తానికి జీబ్రా సక్సెస్ తో ఈ రకంగా సత్యదేవ్ సంతోషంలోనే ఎమోషనల్ అయ్యాడు.
Read Also:Sabarimala: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పోర్టల్