CM YS Jagan Vizag Shifting: వైజాగ్ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. దసరా నుంచి విశాఖ నుంచే పాలన సాగించాలని భావించారు.. అన్ని కుదిరితే దసరాకి సీఎం జగన్ విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతారని వైసీపీ నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు.. కానీ, మరికొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతోన్న నేపథ్యంలో.. వైవీ చేసిన కామెంట్లకు ప్రాధాన్యత ఏర్పడింది.. దొడ్డి దారిన వైజాగ్ రావాల్సిన అవసరం మాకు లేదు.. రైట్ రాయల్ గా హైవే మీదే వస్తాం అంటూ విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.. ఇక, నిర్మాణాలు పూర్తయ్యాక సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైజాగ్ వస్తారు.. అది అక్టోబర్ కావొచ్చు.. నవంబర్ కావొచ్చు అని పేర్కొన్నారు.
Read Also: Prabhas: మూడు వారాల గ్యాప్… సలార్ దెబ్బకి బాహుబలి రికార్డులు కూడా లేస్తాయ్
రాజధాని వసతుల కమిటీ ఒకసారి పర్యటించిన తర్వాత బిల్డింగ్ లు ఫైనలైజ్ అవుతాయి అన్నారు వైవీ సుబ్బారెడ్డి.. కానీ, పచ్చ కామెర్లతో ఉన్న టీడీపీ నేతలకు వైజాగ్ అభివృద్ది, ఆకాంక్ష పట్టదని మండిపడ్డారు.. విశాఖ ప్రజలు కోరుకోవడం లేదంటున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎక్కడ నుంచి వచ్చారు..? అని నిలదీశారు. వియ్యంకుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గంటా.. అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇక, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో అనుచితం ఏమీ లేదని.. ఉన్న మాటే ముఖ్యమంత్రి చెప్పారన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు లేని పవన్ కల్యాణ్ కోసం మాట్లాడటం వృథా అని కామెంట్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.