Site icon NTV Telugu

YV SUbba Reddy: వైసీపీ టార్గెట్‌ అదే.. అందుకే ఈ మార్పులు..!

Yv Subbareddy

Yv Subbareddy

YV SUbba Reddy: వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి.. విశాఖ చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇక, ఎయిర్‌పోర్ట్‌ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. మేం 175కి 175 టార్గెట్ పెట్టుకున్నాం.. దానిలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు.. అయితే, వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కూడా రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలన్నారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం.. కానీ, ఆయన పార్టీని వీడారు.. అయితే, పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా మాకు ఏమీ ఇబ్బంది లేదు.. ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read Also: Medak Student: విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్.. అర్ధనగ్నంగా హంగామా..!

ఇక, చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా నాయకుడు వైఎస్‌ జగన్‌కు తిరుగులేదన్నారు వైవీ సుబ్బారెడ్డి.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి మళ్లీ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే, పార్టీలో మార్పులు చేర్పులపై స్పందిస్తూ.. ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగోలేదు అక్క ఇంఛార్జీలను మార్చామని వల్లడించారు. మేండ 175 స్థానాలకి 175లో గెలుపే టార్గెట్ పెట్టుకున్నాం.. దానిలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయన్నారు. ఎక్కడ అయితే అభ్యర్థులను మారుస్తున్నామో.. అక్కడ ముందు పనిచేసిన నాయకులు సహకరించాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఇక, జనవరి నెలకి బస్సుయాత్ర ముగింపు దిశగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఇబ్బందులు వల్లే రాజధాని మార్చడం ఆలస్యం అయింది.. తప్పకుండా సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. విశాఖ నుంచి పాలన సాగిస్తారని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.

Exit mobile version