NTV Telugu Site icon

IND vs NZ: చాహల్ కొత్త గర్ల్ ఫ్రెండ్.. స్టేడియంలో ఫైనల్‌ చూస్తూ ఎంజాయ్!

Chahal

Chahal

భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి యుజ్వేంద్ర చాహల్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరుకున్నాడు. కానీ ఒంటరిగా కాదు. ధనశ్రీ వర్మ నుంచి విడాకుల వార్తల మధ్య.. అతను ఒక మిస్టరీ అమ్మాయితో కనిపించాడు. మ్యాచ్ సమయంలో కెమెరా మెన్ చాహల్, తన కొత్త స్నేహితురాలిపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు అందరూ ఈ కొత్త అందగత్తె ఎవరో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చాహల్ పక్కన కూర్చుని అతడితో సన్నిహితంగా కనిపించిన బ్యూటీ ప్రముఖ ఆర్జే మహ్వాష్ అని తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్‌తో ఆమె డేటింగ్ చేస్తోందని ఈ మధ్య బాగా పుకార్లు వచ్చాయి. వీళ్లిద్దరూ రెస్టారెంట్‌లో సందడి చేసిన పలు ఫొటోలు వైరల్‌ అయ్యాయి. తాజాగా ఈ జంట మరోసారి స్టేడియంలో సందడి చేయడంతో విషయం ఈ అంశంపై మరోసారి చర్చనీయాంశమైంది.

READ MORE: Harish Rao: రేవంత్‌రెడ్డి మహిళా దినోత్సవ వేడుకల్లో పచ్చి అబద్ధాలు మాట్లాడారు..

కాగా.. భారత్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ న్యూజిలాండ్‌ 252 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ముందుంచింది. కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (51) రాణించారు. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34), ఫర్వాలేదనిపించారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లేథమ్ (14), మిచెల్‌ శాంట్నర్‌ (8) పరుగులు చేశారు. నాథన్‌ స్మిత్‌ 0 (1) నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ పడగొట్టారు.

READ MORE: Chiranjeevi: హీరోయిన్ శ్రీలీల‌ను స‌త్కరించిన మెగాస్టార్