NTV Telugu Site icon

Yuvraj Singh: అభిషేక్ శర్మ ప్రపంచకప్లో స్థానం లభించడం ఛాన్సే లేదు.. ఇంకా నేర్చుకోవాలి..!

Yuvi

Yuvi

ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో 16 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన అభిషేక్ శర్మకు టీ20 ప్రపంచకప్ లో చోటు లభించే అవకాశాలు ఉన్నాయా..?. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. ప్రపంచకప్ లో స్థానం లభించడం ఛాన్సే లేదంటున్నారు. కాగా.. ఈ ఐపీఎల్ లో అభిషేక్ 218 స్ట్రైక్ రేట్ లో ఆడుతున్నాడు. తాను క్రీజులో ఉన్నంతసేపు బాల్ బౌండరీలు దాటాల్సిందే.. ప్రత్యర్థి బౌలర్లకు అతను చుక్కలు చూపిస్తున్నాడు.

Vakeel Saab: థియేటర్లలోకి వకీల్ సాబ్ మళ్ళీ వస్తున్నాడు

ఈ క్రమంలో.. యువరాజ్ సింగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ, “అభిషేక్ దాదాపు ప్రపంచకప్ ఆడేంత వరకు చేరుకున్నాడు, కానీ అతను ప్రపంచ కప్ ఆడటానికి సిద్ధంగా లేడని నేను అనుకుంటున్నాను. ప్రపంచ కప్ కోసం మాకు అనుభవజ్ఞులైన జట్టు అవసరం. కొంతమంది యువ ఆటగాళ్ళు భారత్ తరుఫున ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రపంచకప్ తర్వాత భారత్‌ తరుఫున ఆడండి.. వచ్చే ఆరు నెలలు వారికి చాలా ముఖ్యమైనవి.” అని చెప్పుకొచ్చాడు.

KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..

2007లో టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన యువరాజ్, అభిషేక్ తన బ్యాటింగ్‌కు ఇంకా కొంచెం పని చెప్పాల్సి ఉందన్నాడు. “సహజంగానే అభిషేక్ ప్రదర్శన మెరుగుపడింది. అతని స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది, కానీ పెద్ద స్కోర్లు రావడం లేదు. ఇండియా తరుఫున ఆడాలనుకుంటే, ఈ రకమైన స్ట్రైక్ రేట్‌తో పెద్ద స్కోర్ చేయడం ముఖ్యం. భారత్‌కు ఆడాలంటే అభిషేక్.. కొన్ని పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడి తన విలువను నిరూపించుకోవాలి.” అని యువరాజ్ సింగ్ చెప్పాడు. ఐపీఎల్ 2024లో అభిషేక్ శర్మ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో.. అభిషేక్ ఇప్పటివరకు 218 స్ట్రైక్ రేట్‌తో 288 పరుగులు చేశాడు. అంతేకాకుండా.. కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.

Show comments