Site icon NTV Telugu

Yuvraj Singh: సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాదు.. తానే నా బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్..!

Yuvi

Yuvi

Yuvraj Singh: భారత క్రికెట్ చరిత్రలో గొప్ప మ్యాచ్ విన్నర్లలో ఒకరిగా పేరుగాంచిన యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చేపలసిన పనిలేదు. ఆయన అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలను క్రికెట్ అభిమానులకు అందించాడు. 2000లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ గెలుపు నుంచి, 2011 వరల్డ్ కప్‌లో భారత్‌కు 28 ఏళ్ల తర్వాత ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు యూవీ. ఈ రెండు టోర్నమెంట్‌లలోనూ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు సాధించడం మరో విశేషం.

Singer Mangli : మంగ్లీ చీటింగ్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్?

అంతేకాకుండా 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ విజయంలో కూడా యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో యువరాజ్ అనేక దిగ్గజ ఆటగాళ్లతో కలిసి ఆడి, ఎన్నో గుర్తుండిపోయే పార్ట్నర్షిప్‌లు నమోదు చేశాడు. అయితే తాజాగా మైఖేల్ వాన్‌తో ‘ది ఓవర్‌ ల్యాప్ క్రికెట్’ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన యువరాజ్ సింగ్, తనకు ఇష్టమైన బ్యాటింగ్ పార్ట్నర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో యూవీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల కంటే ఎంఎస్ ధోనీనే తన బెస్ట్ బ్యాటింగ్ పార్ట్నర్‌గా తేల్చేశాడు.

యువరాజ్–ధోనీ జంట కలిసి అనేక మ్యాచ్‌ల్లో కీలక భాగస్వామ్యాలు నమోదు చేసింది. ముఖ్యంగా 2006లో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన 4-1 వన్డే సిరీస్ విజయానికి ఈ జంట ప్రధాన కారకులుగా నిలిచింది. అలాగే 2017లో ఇంగ్లాండ్‌పై కటక్‌ లో జరిగిన మ్యాచ్‌ లో వీరిద్దరూ కలిసి 256 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ మ్యాచ్‌లో యువరాజ్ 150 పరుగులు చేసి కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించాడు.

PBKS vs SRH: టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్‌.. ఇద్దరు స్టార్స్ అవుట్, రెండు మార్పులతో బరిలోకి సన్‌రైజర్స్!

మరోవైపు యువరాజ్ సింగ్ విరాట్ కోహ్లీతో కూడా అనేక కీలక పార్ట్నర్‌షిప్‌లు నమోదు చేశాడు. ముఖ్యంగా 2016 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ పై సాధించిన విజయాల్లో వీరి భాగస్వామ్యం కీలకం. ఇక సచిన్ టెండూల్కర్‌ తో కలిసి 2008లో చెన్నై టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ చేసిన 387 పరుగుల రికార్డు చేజ్‌లో యువరాజ్ పాత్ర మరువలేనిది. ఇదే ఇంటర్వ్యూలో ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీపై కూడా యువరాజ్ ప్రశంసలు కురిపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ పై ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన తర్వాత మొదట ఫెరారీ ఇస్తానని చెప్పి, తర్వాత పోర్షే 911 ఇవ్వాలని హామీ ఇచ్చారని గుర్తు చేశాడు. చివరికి యువరాజ్‌కు బీఎండబ్ల్యూ ఎం5 కారును బహుమతిగా అందించారని వెల్లడించాడు.

Exit mobile version