Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ysrcp Vs Bjp In Tirupati Prudhvi Sensational Comments On Bhumana Abhinay Reddy

YSRCP VS BJP: వైసీపీ వర్సెస్ బీజేపీ.. యువ నేతల మాటల యుద్ధం..

Published Date :March 28, 2025 , 4:34 pm
By Sudhakar Ravula
  • తిరుపతిలో వైసీపీ, బీజేపీ యువ నేతల మాటల యుద్ధం..
  • తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెస్ కు నిధుల విడుదలపై వివాదం..
YSRCP VS BJP: వైసీపీ వర్సెస్ బీజేపీ.. యువ నేతల మాటల యుద్ధం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

YSRCP VS BJP: తిరుపతిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా మారింది.. వైసీపీ, బీజేపీ యువ నేతల మాటల యుద్ధం నడుస్తోంది.. టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెస్ కు కోటి రూపాయల విడుదల చేయడంపై వివాదం మొదలైంది.. తిరుపతి పారిశుధ్య పనులకు టీటీడీ నిధులు కేటాయించినప్పుడు అడ్డుకున్న భానుప్రకాష్ రెడ్డి.. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిధులు కేటాయింపుపై ఏ సమాధానం చెప్తారంటూ భూమన అభినయ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. అంతేకాదు.. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ అభినయ్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టడం ప్రారంభించారు.. ఇక, భాను ప్రకాష్ రెడ్డి పై వైసీపీ నేతల పోస్టులపై స్పందించిన భాను ప్రకాష్ రెడ్డి కుమారుడు పృథ్వి.. భూమన అభినయ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు.. కరుణాకర్ రెడ్డి కుటుంబం వందల కోట్లు ఎలా సంపాదించిందో తిరుపతి ప్రజలకి తెలుసు.. మా కుటుంబం 1960 నుండి వ్యాపారాలు చేస్తున్నాం, ఆర్థికంగా బలంగా ఉన్నాం.. మరి భూమన కుటుంబం ఏ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించారో చెప్పాలని సవాల్‌ చేశారు.

Read Also: Samantha : నాకు నచ్చినట్టు బతుకుతా.. రూల్స్ పెడితే నచ్చదుః సమంత

తిరుపతి ప్రజలు మీపై నమ్మకం లేక కూటమికి 63 వేల మెజారిటీ ఇచ్చారు.. అభినయ్ రెడ్డి గురించి తిరుపతి ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారో అభినయ్ రెడ్డి తొట్టి గ్యాంగ్‌ తెలుసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు పృథ్వి.. ఇక, అభినయ్ రెడ్డి తొట్టి గ్యాంగ్ కు ఒక సూచన చేస్తున్నా.. మూడు దశాబ్దాలుగా ఉన్న సీనియర్ లీడర్లు బయటకు వచ్చేశారు.. భూమన కుటుంబం ఇచ్చిన స్క్రిప్టును చదివితే రేపు మీ పరిస్థితి అంతే.. ఆ కుటుంబ ఆర్థిక చరిత్ర విప్పితే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రావు.. మా కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అంటూ వార్నింగ్‌ ఇచ్చారు భాను ప్రకాష్ రెడ్డి కుమారుడు పృథ్వి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhanu prakash reddy
  • Bhumana Abhinay Reddy
  • Prudhvi
  • Tirupati
  • ysrcp vs bjp

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions