వైసీపీ, బీజేపీ యువ నేతల మాటల యుద్ధం నడుస్తోంది.. టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెస్ కు కోటి రూపాయల విడుదల చేయడంపై వివాదం మొదలైంది.. తిరుపతి పారిశుధ్య పనులకు టీటీడీ నిధులు కేటాయించినప్పుడు అడ్డుకున్న భానుప్రకాష్ రెడ్డి.. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిధులు కేటాయింపుపై ఏ సమాధానం చెప్తారంటూ భూమన అభినయ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు..
నా మీద విష ప్రచారం చేయడానికి వైసీపీ సోషల్ మీడియా వంద కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు కిరణ్ రాయల్.. రాష్ట్రం మొత్తం నన్ను తప్పుగా చూపిస్తూ.. పార్టీని డ్యామెజ్ చేయాలని కుట్ర పన్నారు.. ఎన్నికల ముందు లక్ష్మీతో అభినయ్ రెడ్డి ఒప్పందం కూర్చుకున్నాడు.. కిరణ్ రాయల్ కు తిరుపతి సీటు వస్తే.. అప్పుడు ఇలాంటి ప్రచారం చేయాలి.. పది కోట్లు ఇస్తామని లక్ష్మీతో అగ్రిమెంట్ చేసుకున్నాడు అభినయ్ రెడ్డి అని విమర్శించారు.