YSRCP VS BJP: తిరుపతిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా మారింది.. వైసీపీ, బీజేపీ యువ నేతల మాటల యుద్ధం నడుస్తోంది.. టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెస్ కు కోటి రూపాయల విడుదల చేయడంపై వివాదం మొదలైంది.. తిరుపతి పారిశుధ్య పనులకు టీటీడీ నిధులు కేటాయించినప్పుడు అడ్డుకున్న భానుప్రకాష్ రెడ్డి.. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిధులు కేటాయింపుపై ఏ సమాధానం చెప్తారంటూ భూమన అభినయ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. అంతేకాదు.. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అభినయ్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టడం ప్రారంభించారు.. ఇక, భాను ప్రకాష్ రెడ్డి పై వైసీపీ నేతల పోస్టులపై స్పందించిన భాను ప్రకాష్ రెడ్డి కుమారుడు పృథ్వి.. భూమన అభినయ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.. కరుణాకర్ రెడ్డి కుటుంబం వందల కోట్లు ఎలా సంపాదించిందో తిరుపతి ప్రజలకి తెలుసు.. మా కుటుంబం 1960 నుండి వ్యాపారాలు చేస్తున్నాం, ఆర్థికంగా బలంగా ఉన్నాం.. మరి భూమన కుటుంబం ఏ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించారో చెప్పాలని సవాల్ చేశారు.
Read Also: Samantha : నాకు నచ్చినట్టు బతుకుతా.. రూల్స్ పెడితే నచ్చదుః సమంత
తిరుపతి ప్రజలు మీపై నమ్మకం లేక కూటమికి 63 వేల మెజారిటీ ఇచ్చారు.. అభినయ్ రెడ్డి గురించి తిరుపతి ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారో అభినయ్ రెడ్డి తొట్టి గ్యాంగ్ తెలుసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు పృథ్వి.. ఇక, అభినయ్ రెడ్డి తొట్టి గ్యాంగ్ కు ఒక సూచన చేస్తున్నా.. మూడు దశాబ్దాలుగా ఉన్న సీనియర్ లీడర్లు బయటకు వచ్చేశారు.. భూమన కుటుంబం ఇచ్చిన స్క్రిప్టును చదివితే రేపు మీ పరిస్థితి అంతే.. ఆ కుటుంబ ఆర్థిక చరిత్ర విప్పితే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రావు.. మా కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అంటూ వార్నింగ్ ఇచ్చారు భాను ప్రకాష్ రెడ్డి కుమారుడు పృథ్వి.